News October 8, 2025
KNR: డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 2025- 26 విద్యాసంవత్సరానికి DMIT, DANS డిప్లొమా కోర్సులకు అర్హులైన MPC, Bi.PC అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28లోపు కళాశాలలో అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాలని, మరిన్ని వివరాలకు కళాశాల పోర్టల్‌ను సందర్శించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. WEBSITE: http://www.gmknr.com. SHARE IT.
Similar News
News October 8, 2025
కోడేరులో అత్యధిక వర్షపాతం

నాగర్ కర్నూల్ జిల్లాలో గడచిన 24 గంటలలో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. జిల్లాలో కోడేరు మండలంలోనే అత్యధికంగా 32.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్ కర్నూల్‌లో 21.3, కల్వకుర్తిలో 14.0, తిమ్మాజీపేటలో 12.3, బల్మూరులో 11.3, పెద్దకొత్తపల్లిలో 11.0, వెల్దండలో 8.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.
News October 8, 2025
బీసీ రిజర్వేషన్లు.. విచారణ వాయిదా

TG: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవోపై మధ్యాహ్నం 12.30కు విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు, తీర్పును చదివి తదుపరి విచారణ చేపడతామని పేర్కొంది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్, అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు హైకోర్టు వద్దకు చేరుకున్నారు.
News October 8, 2025
పెద్దపల్లి: ఉద్యోగానికి టాటా.. పొలిటికల్ బాట..!

స్థానిక ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికలో జిల్లాలోని పార్టీల సీనియర్ నాయకులు సమాలోచనలు చేస్తున్నారు. ఒకవేళ ఎన్నికలు రద్దు కాకుంటే ఎలక్షన్స్ రసవత్తరంగా జరగనున్నాయి. ఇప్పటికే గ్రామాల్లో అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తామని ప్రకటించుకున్నారు. అయితే, ఈసారి చాలామంది యువత వారు చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ రాజకీయ ప్రవేశం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఉద్యోగాలకు టాటా.. పొలిటికల్ బాట అంటున్నారు.