News October 18, 2025

KNR: డీసీసీబీలో బ్యాంకులో ఉద్యోగావకాశాలు

image

కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (DCCB)లో 43 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీఈఓ సత్యనారాయణ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 18 నుంచి నవంబర్ 6 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. రాత పరీక్ష డిసెంబర్‌లో నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు, నిబంధనల కోసం అభ్యర్థులు బ్యాంకు వెబ్‌సైట్ https://karimnagardccb.orgను సందర్శించాలని సూచించారు.

Similar News

News October 19, 2025

జిల్లా కలెక్టర్ డా.సిరి హెచ్చరిక.!

image

దీపావళి సందర్భంగా కేటాయించిన ప్రదేశాలలోనే టపాకాయలు విక్రయించాలని, నిబంధనలకు అనుగుణంగా పర్యవేక్షించాలని శనివారం కలెక్టర్ ఆర్డీవోలు, తహసీల్దార్లకు సూచించారు.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీపావళి సంతోషంగా జరుపుకోవాలని, బాణాసంచా కాల్చే సమయంలో ముఖ్యంగా చిన్న పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ ప్రజలను విజ్ఞప్తి చేశారు.

News October 19, 2025

కామారెడ్డి: స్టార్ క్యాంపెనియర్‌గా షబ్బీర్ అలీ

image

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరగనున్న ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెనీయర్‌గా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీని నియమించారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కార్యదర్శి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. అక్కడ జరగనున్న ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు.

News October 19, 2025

మద్నూర్: హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్ట్

image

హత్యాయత్నం కేసులో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బిచ్కుంద CI రవికుమార్ వివరాలు.. మద్నూర్ PS పరిధి సిర్పూర్ శివారులో మహారాష్ట్రకు చెందిన వారు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామస్థులు ఫరూక్ సహా ఐదుగురు వారిని అడ్డుకున్నారు. నిందితులు వారిపై దాడి చేయగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగతా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని CI వెల్లడించారు.