News July 9, 2024
KNR: డ్రగ్స్ నియంత్రణపై కలెక్టర్ అవగాహన
అధికారులు, ప్రజలు అందరం కలిసి డ్రగ్స్ అనే మహమ్మారిని జిల్లా నుంచి తరిమికొడదామని, డ్రగ్స్ రహిత జిల్లాగా తయారు చేద్దామని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. డ్రగ్స్ నియంత్రణపై ఎక్సైజ్‌శాఖ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ అవగాహన సమావేశం నిర్వహించారు. యువత డ్రగ్స్, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. వ్యసనాల బారిన పడి యువత ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు.
Similar News
News November 28, 2024
హుస్నాబాద్ నూతన పురపాలక సంఘానికి బొప్పారాజు పేరు: మంత్రి పొన్నం
హుస్నాబాద్‌లో నూతన పురపాలక సంఘ భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం, సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి కలిసి మున్సిపల్ ఛైర్మన్ ఆకుల రజిత, కమిషనర్ మల్లికార్జున్లను చైర్లో కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ అనిత, కౌన్సిలర్లు, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుపతి రెడ్డి తదితరులున్నారు.
News November 28, 2024
కేంద్ర మంత్రి కలిసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గురువారం ఢిల్లీలోని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిశారు. ఈ సందర్భంగా రామగుండం ప్రాంతంలో ఎయిర్ పోర్ట్ ద్వారా ఎంతో అభివృద్ధి చెందుతుందని కొత్తగా ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉందని ఇదివరకే ఎన్ టి పి సి, బసంత్,నగర్ సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయని తద్వారా ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు.
News November 28, 2024
కరీంనగర్: ఫుడ్ పాయిజన్ ఘటనలను నిరసిస్తూ ABVP నిరసన
రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలను నిరసిస్తూ ఏబీవీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం నాయకులు కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. నాసిరకం భోజనం పెడుతూ విద్యార్థుల ఆరోగ్యాలతో ఆటలాడుతోందని మండిపడ్డారు. సంబంధిత అధికారులు చొరవ చేసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.