News December 12, 2025

KNR: తాటి గేగులు.. ఆరోగ్య సిరులు!

image

ప్రకృతి మనకు అందించిన అద్భుతమైన ఆహారాల్లో ‘తాటి గేగులు’ ఒకటి. పల్లెటూర్లలో ఎక్కువగా దొరికే ఈ గేగులు ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు పట్టణాల్లోనూ అందుబాటులో ఉన్నాయి. కేవలం రుచికోసమే కాకుండా, వీటిని తినడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తాటి గేగులలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

Similar News

News December 20, 2025

ధనుర్మాసం: ఐదోరోజు కీర్తన

image

మధురా నగరంలో, యమునా తీరంలో జన్మించిన కృష్ణుడు అద్భుత గుణాలు కలవాడు. గొల్ల కులాన్ని తన రాకతో ప్రకాశింపజేశాడు. యశోద గర్భానికి వెలుగునిచ్చిన ఆయనను మనం పవిత్రమైన మనసుతో శరణు వేడాలి. ఏ కోరికలు కోరక స్వామిని భక్తితో పూజించాలి. ఆయన కల్యాణ గుణాలను గానం చేయాలి. ఫలితంగా మన పాపాలు పోతాయి. రాబోవు దోషాలన్నీ అగ్నిలో పడిన దూదిలా భస్మమవుతాయి. సర్వపాప హరుడైన ఆ పరమాత్మ నామస్మరణను ఎప్పుడూ మరువకూడదు. <<-se>>#DHANURMASAM<<>>

News December 20, 2025

మెదక్: నాడు తండ్రి.. నేడు కొడుకు సర్పంచ్

image

మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో నాడు తండ్రి సర్పంచ్ కాగా.. నేడు తనయుడు సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో ముప్పిరెడ్డిపల్లి సర్పంచ్‌గా కందాల రాజ నర్సింహా విజయం సాధించగా ఆయన తండ్రి కందాల సాయిలు గతంలో ముప్పిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా గెలిచారు.

News December 20, 2025

జోనర్లు మార్చుకుంటున్న రవితేజ

image

గతంలో వరుసగా మాస్ సినిమాలు చేసిన రవితేజ ప్రస్తుతం తన పంథా మార్చారు. ఇటీవల ఒక్కో సినిమాకు ఒక్కో జోనర్ సెలక్ట్ చేసుకొని అలరిస్తున్నారు. ధమాకాతో మాస్, రావణాసురతో థ్రిల్లర్‌కు ఓటేసిన ఆయన టైగర్ నాగేశ్వరరావుతో పీరియాడిక్ డ్రామా ఎంచుకున్నారు. త్వరలో అనుదీప్‌తో కామెడీకి సిద్ధమవుతున్నారు. సంక్రాంతికి ఫ్యామిలీ డ్రామా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో వస్తున్నారు. ఈ మూవీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.