News October 18, 2025
KNR: దరఖాస్తులకు స్పందన కరవు.. రీటెండరింగ్ తప్పదా?

2025-27కు గాను వైన్ షాప్ టెండర్లకు ఈ సారి ప్రభుత్వం ఆశించిన మేర స్పందన లేదు. ఒక్క షాప్‌కు 10 కంటే దరఖాస్తులు తక్కువ వస్తే రీ టెండర్ చేయాలన్న నిబంధన ఉంది. ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా సుమారు 45 షాపుల వరకు 1, 2 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దరఖాస్తులకు చివరి రోజు బీసీ రిజర్వేషన్ల బంద్ ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. ఇప్పటికీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 287 వైన్ షాపులకు గాను 3261 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
Similar News
News October 18, 2025
అలసత్వం వద్దు.. అధికారులకు సీఎం వార్నింగ్

TG: ప్రభుత్వ స్కీముల అమలులో అలసత్వం వహిస్తే సహించేది లేదని అధికారులను CM రేవంత్ హెచ్చరించారు. CMO కార్యదర్శులు, CSతో సమావేశమయ్యారు. కొందరు అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఎవరికివారు సొంత నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు. అన్ని విభాగాల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని, పనుల పురోగతిని సమీక్షించాలి. ఫైళ్లు, పనులు ఆగిపోవడానికి వీల్లేదు’ అని స్పష్టం చేశారు.
News October 18, 2025
గర్భిణీలు, పిల్లలు బాణసంచాకు దూరంగా ఉండాలి

కొత్తగూడెం టౌన్ రామవరం 4 అంగన్వాడీ కేంద్రంలో శనివారం దీపావళి సంబరాలు జరిపారు. సూపర్వైజర్ పార్వతి హాజరై పిల్లలు, గర్భిణీలతో మాట్లాడారు. గర్భిణీలు, పిల్లలు బాణాసంచాకు దూరంగా ఉండాలని సూచించారు. దీపాలు వెలిగించి, మిఠాయిలు తిని సంతోషంగా దీపావళి జరుపుకోవాలని చెప్పారు. బాణసంచా నుంచి వచ్చే శబ్దం పొగ వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.
News October 18, 2025
ఎలమంచిలి ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాస తీర్మానం

ఎలమంచిలి ఎంపీపీ బి. గోవిందుపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. గత నెల 24న జనసేనకు చెందిన నలుగురు ఎంపీటీసీలు అవిశ్వాసానికి నోటీసు ఇవ్వగా, దీనిపై అనకాపల్లి ఆర్డీఓ షేక్ ఆయిషా శనివారం సాయంత్రం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నోటీస్ ఇచ్చిన నలుగురు సభ్యులు హాజరయ్యారు. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు ఆర్డీఓ ప్రకటించారు. త్వరలో కొత్త ఎంపీపీని ఎన్నుకుంటారు.