News December 30, 2025
KNR: దివ్యాంగుల జంటలకూ రూ.లక్ష వివాహ ప్రోత్సాహకం

దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటే ఇచ్చే రూ.లక్ష ప్రోత్సాహకాన్ని ఇకపై ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే 19, 2025 తర్వాత వివాహం చేసుకున్నవారు www.epass.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం దరఖాస్తులను స్థానిక ఐసీడీఎస్(ICDS) కార్యాలయంలో సమర్పించాలని కరీంనగర్ జిల్లా సంక్షేమ అధికారి పేర్కొన్నారు.
Similar News
News January 2, 2026
నా భర్త ముఖంపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు: బంగ్లా బాధితురాలు

బంగ్లాదేశ్‌లోని షరియత్‌పూర్ జిల్లాలో ఖోకన్ దాస్ అనే <<18733577>>హిందువుపై<<>> దారుణంగా దాడి చేసిన విషయం తెలిసిందే. తన భర్తకు ఎవరితోనూ ఎలాంటి గొడవలు లేవని, ఎందుకు అంత కిరాతకంగా ప్రవర్తించారో తెలియడం లేదని బాధితుడి భార్య సీమా దాస్ వాపోయారు. తన భర్త తల, ముఖంపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారని కన్నీళ్లు పెట్టుకున్నారు. తాము హిందువులమని, శాంతియుతంగా బతకాలని కోరుకుంటున్నామని చెప్పారు.
News January 2, 2026
నవోదయానికి కేరళ రెడీ: మోదీ

కేరళ యువత, మహిళలు కొత్త ఉదయానికి సిద్ధంగా ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. తిరువనంతపురం మేయర్‌గా కొత్తగా ఎన్నికైన VV రాజేశ్, డిప్యూటీ మేయర్ ఆశా జి.నాథ్‌కు లేఖ రాశారు. ప్రజల ఛాయిస్‌గా ఎన్డీయే మారుతోందని అందులో పేర్కొన్నారు. కేరళలోని ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ ముగింపుకు వచ్చాయని పేర్కొన్నారు. ఆ కూటములు పేలవమైన పాలన సాగించాయని, వాటి హయంలో అవినీతి, రాజకీయ హింస పెరిగిపోయిందని ఆరోపించారు.
News January 2, 2026
ఇన్‌స్టాలో కోహ్లీ పోస్ట్.. 3 గంటల్లోనే 50L లైక్స్

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫొటో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఆయన తన భార్య అనుష్కతో తీసుకున్న చిత్రం వైరలవుతోంది. 3 గంటల్లోనే 50 లక్షల లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం లైక్స్ 81 లక్షలు దాటాయి. Dec 31న పోస్ట్ చేసిన మరో ఫొటోను గంటలోనే 40 లక్షల మంది ఇష్టపడటం గమనార్హం. కాగా టెస్టులు, T20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ ODIలు మాత్రమే ఆడుతుండటం తెలిసిందే.


