News October 1, 2025
KNR: ‘నర్సరీలోని మొక్కలను సంరక్షించాలి’

నగరపాలిక ఆధ్వర్యంలో ఎల్ఎండీ సమీపంలో ఏర్పాటు చేసిన నర్సరీని కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. మొక్కలు ఎండిపోకుండా నీటిని అందిస్తూ ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఎప్పటికప్పుడు నర్సరీలో పిచ్చి మొక్కలు, గడ్డి తొలగించి శుభ్రం చేయాలన్నారు. రోడ్డు డివైడర్ల మధ్యలో మొక్కలు నాటించాలని సూచించారు.
Similar News
News October 1, 2025
డీఎస్పీగా మహేశ్వరి.. సీపీ గౌస్ ఆలం అభినందన

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలానికి చెందిన మోదుంపల్లి మహేశ్వరీ గ్రూప్-1 ఫలితాల్లో 474వ ర్యాంకు సాధించి డీఎస్పీ ఉద్యోగాన్ని దక్కించుకుంది. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో చదివిన ఆమె విజయంపై కరీంనగర్ సీపీ గౌస్ అలాం ప్రత్యేక అభినందనలు తెలిపారు. మహేశ్వరీ విజయం గ్రామీణ యువతకు స్ఫూర్తిగా నిలిచింది.
News October 1, 2025
కరీంనగర్ మహాశక్తి ఆలయంలో BJP స్టేట్ చీఫ్ పూజలు

ప్రసిద్ధి చెందిన కరీంనగర్ చైతన్యపురి కాలనీలోని శ్రీ మహాశక్తి దేవాలయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఉన్నారు.
News October 1, 2025
KNR: విద్యుత్ షాక్.. చికిత్స పొందుతూ యువకుడు మృతి

కరీంనగర్ రూరల్ మండలం చర్ల బూత్కూరులో విద్యుత్ షాక్‌కు గురైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. లింగంపల్లి రాజేష్(22) గతనెల 28న ఇంటి వద్ద బట్టలు ఆరేసే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందాడు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.