News December 25, 2025

KNR: నామినేటెడ్ పోస్టులకు సీఎం గ్రీన్ సిగ్నల్?

image

నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడానికి CM రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. నియోజకవర్గాల పరిధిలో ఉన్న DCMS, మార్కెట్ కమిటీలతోపాటు ఇతర నామినేటెడ్ పోస్టుల జాబితాను ఇప్పటికే MLAలు అధిష్ఠానానికి అందించగా.. ఉమ్మడి KNRలో 133 PACSలో సైతం నామినేటెడ్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై అసెంబ్లీ సెషన్ తర్వాత స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.

Similar News

News January 1, 2026

తిరుమలకు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్

image

AP: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అలిపిరి టోల్ గేట్ నుంచి తిరుపతి గరుడ జంక్షన్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. కాగా లక్కీ డిప్ టోకెన్లు ఉన్నవారికి నేటితో దర్శనాలు ముగియనున్నాయి. రేపటి నుంచి జనవరి 8 వరకు టోకెన్లు లేని భక్తులను కూడా దర్శనానికి అనుమతించనున్నారు.

News January 1, 2026

మంత్రి కోమటిరెడ్డిని కలిసిన నల్గొండ కొత్త కలెక్టర్

image

రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని నూతన కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ ఈ రోజు హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ నూతన కలెక్టర్‌కు మంత్రి శుభాకాంక్షలు తెలిపి, ఆల్ ది బెస్ట్ చెప్పారు.

News January 1, 2026

HYDలో కొత్త జిల్లా.. త్వరలో ఉత్తర్వులు?

image

రాజధానికి 4 కమిషనరేట్‌లను తీసుకొచ్చిన ప్రభుత్వం తాజాగా కొత్త జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కమిషనరేట్ల సరిహద్దులకు సమానంగా సిటీ పరిధిలోని 3 జిల్లాలను 4కు పెంచేలా CM ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. RRను ఫ్యూచర్ సిటీతో రూరల్ జిల్లాగా, అర్బన్ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయనుంది. HYDజిల్లాలోని కంటోన్మెంట్‌ ఏరియాను మల్కాజిగిరిలో కలిపి, శంషాబాద్, రాజేందర్‌నగర్‌ను HYDలో కలపనుందట.