News January 5, 2026
KNR: నిలిచిన రిజిస్ట్రేషన్లు.. మూడు రోజులుగా ఇదే గోస!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సాంకేతిక విఘాతం ఏర్పడింది. గత 3రోజులుగా సర్వర్ మొరాయిస్తుండటంతో క్రయవిక్రయాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముందస్తుగా స్లాట్లు బుక్ చేసుకున్న వారు కార్యాలయాల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఫైళ్లు పెండింగ్‌లో పడటంతో రిజిస్ట్రేషన్లు వాయిదా పడుతున్నాయి. సాంకేతిక లోపాన్ని సరిదిద్ది ప్రక్రియను త్వరలోనే పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు.
Similar News
News January 7, 2026
మైలవరం: వేరు వేరు చోట ఇద్దరు ఆత్మహత్య

మైలవరం మండలంలో మంగళవారం ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వద్దిరాలలో దేవ (22) అనే యువకుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇతనికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అలాగే దొమ్మర నంద్యాలకు చెందిన షేక్ నూర్జహాన్ (20) అనే వివాహిత కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ రెండు ఘటనలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News January 7, 2026
HYD: టెక్నికల్ స్కిల్స్‌తోనే భవిష్యత్

టెక్నాలజీతో ప్రపంచం పరుగులు తీస్తుందని HYD టెక్నిపుణులు సురేంద్ర సింగ్ తెలిపారు. హైటెక్ సిటీ, T-HUB, KPHBలో నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ స్ట్రాట అంశాలపై జరిగిన ప్రత్యేక కాన్ఫరెన్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుత యువత టెక్నికల్ స్కిల్స్, సాప్ట్‌వేర్ స్కిల్స్ పెంచుకోవడంతో పాటు నిత్యం అభ్యాసన చేయాలని సూచించారు.
News January 7, 2026
NLG: సన్న బియ్యం.. క్వాలిటీ పట్టించుకోవట్లే!

ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సరఫరా చేస్తున్న సన్నబియ్యం నాణ్యత క్రమక్రమంగా తగ్గుతుంది. గత మూడు నాలుగు నెలల నుంచి సన్నబియ్యంలో అధికంగా నూకలు, తౌడు, మెరిగెలు, రాళ్లు వస్తుండడంతో పాటు ముక్క వాసన వస్తున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 11,54,178 రేషన్ కార్డులు ఉండగా.. 22,132 టన్నుల బియ్యం పంపిణీ చేస్తుంది. వీటిని తినడానికి 40 శాతం పైగానే మంది ఆసక్తి కనబరచడం లేదు.


