News August 30, 2025
KNR: నెల ముందే మద్యం టెండర్ల ప్రక్రియ..!

మద్యం టెండర్ల గడువు NOVతో ముగియనుంది. DEC 1 నుంచి కొత్త మద్యం షాపుల కేటాయింపు ఉంటుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఈ ప్రక్రియను నెలరోజుల(OCTలో) ముందే పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాత లిక్కర్ పాలసీ విధానాన్నే కొనసాగించాలని యోచిస్తోంది. అయితే దరఖాస్తు ఫీజు ప్రస్తుతం రూ.2 లక్షలు ఉండగా, దానిని రూ.3 లక్షలకు పెంచారు. ఉమ్మడి KNRలో 76 BARలు ఉండగా 290 WINES ఉన్నాయి.
Similar News
News August 30, 2025
దుబాయ్‌లో ఎండలు.. ఐసీసీ కీలక నిర్ణయం?

ఆసియా కప్ మ్యాచుల ప్రారంభ సమయాన్ని ICC మార్పు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం 19 మ్యాచులకు గానూ 18 మ్యాచులకు సమయం మార్చినట్లు తెలుస్తోంది. ఇందులో ఫైనల్ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ ప్రకారం ఇండియాలో ప్రతీ మ్యాచ్ రా.8 గంటలకు ప్రారంభం కానుంది. టైమింగ్స్ మార్పునకు ఎండ తీవ్రతలే కారణమని తెలుస్తోంది. దుబాయ్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో ICC ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
News August 30, 2025
ఉద్యోగ మేళాను సందర్శించిన DIEO

హనుమకొండ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహ సమీపంలో ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళాను DIEO శ్రీధర్ సుమన్ సందర్శించారు. ఉద్యోగమేళాలో భాగంగా వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించి, ఇంటర్వ్యూ, ఇతర పరీక్షలను నిర్వహించారు. ఉద్యోగ మేళాను విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకోవాలని DIEOఅన్నారు.
News August 30, 2025
ఆడపిల్లలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు: MP

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. భీమారంలో ఓ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమానికి ఎంపీ హాజరయ్యారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే దృఢమైన సంకల్పం, అంకితభావంతో కష్టపడి పనిచేయాలన్నారు. ఆడపిల్లలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదన్నారు.