News September 21, 2025

KNR: నేటితో ‘పెత్తరమాస’ తర్పణాలు లాస్ట్..!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెత్తరమాస (పెద్దల అమావాస్య) ఈనెల 7న ప్రారంభమైంది. ఈ సందర్భంగా పక్షం రోజులు తండ్రి, తాత, ముత్తాతలు, ఇతరులను తలుచుకొని ఆరాధిస్తారు. వారి సంతానం నైవేద్యాలను సమర్పిస్తుంది. ఇలా చేస్తే తర్వాతి తరాలవారిపై పూర్వీకుల దీవెనలు ఉంటాయని మన పెద్దలు చెబుతుంటారు. కాగా, నేటితో ఈ తర్పణాల కార్యక్రమాలు ముగియనుండగా సాయంత్రం నుంచి బతుకమ్మ వేడుకలు వాడవాడలా ఘనంగా ప్రారంభం కానున్నాయి.

Similar News

News September 21, 2025

HYD: ఆడదే ఆధారం.. భార్యంటే త్యాగం!

image

ఆడదంటే ఆదిపరాశక్తి. ఆమె బంధం వరం, ఓపిక సంద్రం. వివాహ బంధంలోకి అడుగెడితే జీవితమంతా త్యాగమనడానికి వీరే నిదర్శనం. ఘట్కేసర్ అంకుషాపూర్‌‌కు చెందిన భిక్షపతి(50)కి భవానితో, శ్రీరాములు(42)కు సంధ్యతో పెళ్లైంది. 15ఏళ్లుగా భర్తలిద్దరు పక్షవాతంతో మంచానపడ్డారు. వారిని కాపాడుకుంటూ 7అడుగుల బాంధవ్య విలువను కాపాడుతున్నారు. భార్యంటే ప్రత్యక్ష దైవం, ఆడదే ఆధారం అనడానికి సజీవ సాక్ష్యమయ్యారు.
#నేడు భార్యల దినోత్సవం.

News September 21, 2025

ప్రభాస్, ఎన్టీఆర్ తర్వాత తేజానే!

image

‘మిరాయ్’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న యంగ్ హీరో తేజా సజ్జ మరో రికార్డు సృష్టించారు. నార్త్ అమెరికాలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో $2.5M+ గ్రాస్ వసూళ్లు సాధించిన మూడో తెలుగు హీరోగా నిలిచారు. ప్రభాస్, తారక్ మాత్రమే ఉన్న ఈ లిస్టులో ఓ యంగ్ హీరో చేరడం సంచలనమేనని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతకుముందు తేజ నటించిన ‘హను-మాన్’ సినిమాకి కూడా $2.5M+ గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

News September 21, 2025

GNT: మసకబారుతున్న ANU ప్రతిష్ట

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రతిష్ఠ రోజురోజుకు పడిపోతోంది. ఎంఎస్సీ బోటనీలో 88 మందికి 24 మందే ఉత్తీర్ణత సాధించగా, మీడియా మేనేజ్‌మెంట్‌లో నలుగురిలో ఇద్దరు మాత్రమే పాసయ్యారు. విద్యా అంశాలపై కాకుండా అధ్యాపకులు పరిపాలనపై దృష్టి పెట్టడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, ప్రభుత్వం సమర్థవంతమైన వీసీని నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు. గతంలో కంటే యూనివర్సిటీ NIRF ర్యాంకింగ్‌ 24 స్థానాలు తగ్గింది.