News December 27, 2024

KNR: నేడు జరిగే సెమిస్టర్ పరీక్ష వాయిదా!

image

KNR శాతవాహన యూనివర్సిటీ పరిధిలో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నేడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించగా నేటి సెమిస్టరు పరీక్షను వాయిదా వేసినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. రేపటి నుంచి జరగాల్సిన యూనివర్సిటీ పరీక్షలు యథావిధిగా జరుగుతాయాన్నారు. కాగా, నేటి పరీక్ష నిర్వహణ మళ్లీ ఎప్పుడు అనేది ప్రకటిస్తామన్నారు.

Similar News

News December 28, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ. 1,66,999 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.99,943 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ. 53,230, అన్నదానం రూ.13,826 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

News December 27, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని క్రైమ్ న్యూస్

image

☞కాటారం మండలంలో వ్యక్తి దారుణ హత్య ☞రామడుగు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి ☞మంథని: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఐదు మూగజీవాలు మృతి ☞ఎల్కతుర్తి: ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి ☞కమలాపూర్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు ☞వేములవాడ: రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి ☞కమాన్ పూర్: ఈత చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు ☞ఓదెల: షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం.

News December 27, 2024

మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించిన మంత్రి పొన్నం 

image

భారత మాజీ ప్రధానమంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ పార్థివదేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పుష్పాంజ‌లి ఘ‌టించి, నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భార‌త‌దేశం ఆర్థికవేత్త, నిరాడంబరి, దేశం ఒక గొప్ప మ‌హోన్న‌త వ్య‌క్తిని కొల్పోయింద‌ని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.