News April 12, 2025

KNR: నేడు మద్యం దుకాణాలు బంద్: సీపీ

image

కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్స్ పాపులు, బార్లు, క్లబ్, మద్యం డిపోలు మూసివేస్తున్నట్లు కరీంనగర్ సీపీ గౌస్ ఆలం తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా శాంతిభద్రతల దృష్ట్యా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆదేశాలను ఎవరైన ఉల్లంఘిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News April 18, 2025

ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియను వేగవంతం చేయాలి: అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్

image

కరీంనగర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 15 మండలాల్లో ఇండ్ల నిర్మాణానికి మార్కింగ్ ప్రక్రియ 100% పూర్తిచేయాలని అధికారులను అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ ఆదేశించారు. ఇప్పటీవరకు 2027 మందికి ఇండ్లు మంజూరు కాగా, 730 ఇండ్లకు మార్కింగ్ పూర్తయిందని, 114 ఇండ్లు బేస్మెంట్ దశలో ఉన్నాయన్నారు. రెండో దశ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

News April 18, 2025

కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న ఎండ తీవ్రత

image

కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 41.3°C నమోదు కాగా, మానకొండూర్ 40.9, గన్నేరువరం 40.4, రామడుగు 40.2, జమ్మికుంట 40.1, చొప్పదండి 39.9, తిమ్మాపూర్ 39.7, చిగురుమామిడి 39.6, శంకరపట్నం 39.5, కరీంనగర్ రూరల్ 39.4, సైదాపూర్ 39.3, కరీంనగర్ 39.2, వీణవంక 39.0, కొత్తపల్లి 38.6, హుజూరాబాద్ 38.4, ఇల్లందకుంట 38.0°C గా నమోదైంది.

News April 18, 2025

రేపు హుజురాబాద్‌లో స్వచ్భ ఎగ్జిబిషన్: మున్సిపల్ కమిషనర్

image

హుజురాబాద్ పట్టణంలోని సాయి రూప ఫంక్షన్ హాల్‌లో ఈ నెల 19న స్వచ్ఛ ఎగ్జిబిషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. జిల్లాలోనే తొలిసారిగా పర్యావరణంపై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు,, జమ్మికుంట కృషి విజ్ఞాన శాస్త్రవేత్తలు ఎగ్జిబిషన్లను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో ముఖ్య అతిథులుగా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొంటారాని తెలిపారు.

error: Content is protected !!