News October 27, 2025

KNR: నేడే LUCKY ‘డ్రా’ప్.. ఎంట్రీపాస్ MUST..!

image

2025 DEC 1- 2027 NOV 30 వరకు మద్యంషాపులు నిర్వహించేందుకు టెండర్‌దారులు సిద్ధమయ్యారు. ఇవాళ ఆయా జిల్లాల కలెక్టరేట్లలో కలెక్టర్ల ఆధ్వర్యంలో మద్యం టెండర్లకు సంబంధించి ‘లక్కీ డ్రా’ తీయనున్నారు. దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఎంట్రీపాసులు ఉంటేనే లోనికి అనుమతిస్తారు. ఫోన్లను పర్మిషన్ లేదు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 287 షాపులకు 7,584 దరఖాస్తులు రాగా.. వీటి ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.228 కోట్ల ఆదాయం వచ్చింది.

Similar News

News October 27, 2025

మొంథా తుఫాన్.. విద్యుత్ శాఖ నుంచి కీలక ప్రకటన

image

మొంథా తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో NTR జిల్లా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఉప్పలపాటి హనుమయ్య సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
విజయవాడ సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయం: 9440817561
విజయవాడ టౌన్ డివిజన్ కార్యాలయం: 7382623226
గుణదల డివిజన్: 6281703087
విజయవాడ రూరల్: 6281705138
నూజివీడు డివిజన్:8125533788.

News October 27, 2025

అమరావతికి ‘వైకుంఠపురం’ రక్షణ కవచం

image

రాజధాని అమరావతికి వైకుంఠపురం ఒక పెద్ద రక్షణ కవచంగా పనిచేస్తుంది. కృష్ణా నది వరద సమయంలో పడమర నుంచి తూర్పు దిశగా ప్రవహించి, వైకుంఠపురంలోని కొండ దగ్గర తన దిశను ఉత్తరం వైపునకు మార్చుకుంటుంది. ఉత్తర, దక్షిణ దిక్కులలో ఉన్న కరకట్టల కారణంగా వరద నీరు వైకుంఠపురంలోకి రాదు. ఒకవేళ వరద నీరు గ్రామంలోకి వస్తే, రాజధానిలోని గ్రామాలు ముంపునకు గురవడమే కాక, కొట్టుకుపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

News October 27, 2025

మహిళా క్రికెటర్లపై దాడి.. మంత్రి వ్యాఖ్యలతో దుమారం

image

AUS మహిళా క్రికెటర్లను ఓ వ్యక్తి <<18103257>>అసభ్యంగా<<>> తాకిన ఘటనపై MPకి చెందిన మంత్రి విజయ్‌వర్గీయా కామెంట్స్ దుమారం రేపాయి. ‘ఈ ఘటన ప్లేయర్లకు గుణపాఠం లాంటిది. ENGలో ఓ ఫేమస్ ఫుట్‌బాల్ ప్లేయర్‌కు అమ్మాయి కిస్ ఇవ్వడం, అతడి దుస్తులు చింపేయడం వంటివి చూశాను. ప్లేయర్లు తమ పాపులారిటీని తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. ఆయనపై విపక్షాలు, ఉమెన్ రైట్స్ గ్రూప్స్ భగ్గుమన్నాయి.