News November 16, 2024

KNR: న్యాయం చేయమంటే దాడి చేస్తారా?: బండి సంజయ్

image

ABVP నాయకులపై పోలీసులు, బాసర IIIT సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడం దుర్మార్గమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినికి న్యాయం చేయమంటే విచక్షణారహితంగా దాడి చేస్తారా? బాసరలో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోరా? విద్యార్థుల న్యాయమైన డిమాండ్స్ ఎందుకు పరిష్కరించడం లేదని పేర్కొన్నారు.

Similar News

News May 7, 2025

KNR: జిల్లా స్పోర్ట్స్ స్కూల్ రాష్ట్రంలోనే మోడల్‌గా నిలవాలి: కలెక్టర్

image

కరీంనగర్ రీజినల్ స్పోర్ట్స్ స్కూల్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. స్పోర్ట్స్ స్కూల్‌లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోనే రోల్ మోడల్‌గా ఉండేలా తీర్చిదిద్దాలని ఆమె సూచించారు. 

News May 7, 2025

కరీంనగర్: రైతుల సంక్షేమం కోసమే భూభారతి: కలెక్టర్

image

రైతుల భూ సమస్యలు పరిష్కరించి,వారి సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ రైతువేదిక, కొత్తపల్లిలోని రైతువేదికలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ధరణి చట్టంలో సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించలేదని, భూభారతి చట్టంలో మాత్రం పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించేందుకు వీలుంటుందన్నారు.

News May 7, 2025

కరీంనగర్ కొత్తపల్లి చెరువులో మృతదేహం 

image

కరీంనగర్ కొత్తపల్లి చెరువులో గుర్తుతెలియని మృతదేహం తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతుడు కొత్తపల్లికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.