News January 31, 2025
KNR: పట్టభద్రులు మేల్కోండి.. నేడే LAST

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లా పట్టభద్రుల మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే పోటీ దారులు క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టభద్రులను, ఉపాధ్యాయులను కలుస్తూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. పట్టభద్రుల ఓటర్ నమోదుకు దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది.
Similar News
News September 19, 2025
వరి పంట నారుమడులను పరిశీలించిన కలెక్టర్

దువ్వూరు మండలంలో సాగు చేసిన వరి పంట నారుమడులను గురువారం కలెక్టర్ శ్రీధర్ పొలాలకు వెళ్లి నేరుగా పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంటల సాగు పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విత్తనాలు, ఎరువులు అందుబాటుపై రైతులతో చర్చించారు. తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించేందుకు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలన్నారు. డిమాండ్, మార్కెట్ ఉన్న వాటిని సాగు చేయాలని సూచించారు.
News September 19, 2025
VKB: ‘మహిళలను మహిళా సంఘాల్లో చేర్పించాలి’

నిరుపేద మహిళలను మహిళా సంఘాల్లో 100% చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో మెప్మా సిబ్బంది, మహిళా సంఘాల రిసోర్స్ పర్సన్‌తో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రుణాలు తీసుకున్న మహిళా సంఘాలు అభివృద్ధి దిశగా పయనించాలన్నారు.
News September 19, 2025
అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి: BHPL కలెక్టర్

అందరికీ విద్య, సౌకర్యాలు అందించడంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మంచినీరు, విద్యుత్, మరుగుదొడ్లు, మరమ్మతులు వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటుపై పంచాయతీరాజ్, విద్యా, మహిళా సంక్షేమ, డీఆర్డీఓ, గిరిజన, టీజీడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు.