News January 25, 2026
KNR: పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలి.. ఆదమరిస్తే అంతే!

ఉమ్మడి KNR జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక, అటవీ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. గోదావరి, మానేరు నది తీరాన పురాతన శిథిలావస్థలోని ఆలయాలు, రామగిరి ఖిల్లా, ధూళికట్ట బౌద్ధక్షేత్రంతో పాటు జలాశయాలను మరింత సుందరంగా తీర్చిదిద్దేలా అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మీ ప్రాంతంలోని పురాతన దేవాలయాలు ఎలా ఉన్నాయో కామెంట్ చెయ్యండి.
Similar News
News February 26, 2026
సంగారెడ్డి: మీ ఇంటికే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసేలా RTC ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సంగారెడ్డిలోని కార్యాలయంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ గురువారం ఆవిష్కరించారు. భక్తులు రూ.150 చెల్లించి సమీపంలోని ఆర్టీసీ కార్గో, లేదా www.tgslogistics.co.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని, ఆసక్తిగలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News February 26, 2026
ఆదిలాబాద్‌లో SSC విద్యార్థులకు గ్రాండ్ ప్రాక్టీస్ టెస్టులు

ఆదిలాబాద్ జిల్లాలో పదో తరగతి విద్యార్థుల కోసం గ్రాండ్ టెస్టుల షెడ్యూల్‌ను జిల్లా విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 2 నుంచి 10 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు ప్రత్యేక తేదీలను కేటాయించారు. ఈ పరీక్షల ద్వారా విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు మరింత మెరుగ్గా తయారవ్వాలనే ఉద్దేశంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు.
News February 26, 2026
జమ్మికుంట: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

జమ్మికుంట మార్కెట్లో పత్తి ధర నిన్నటి కంటే ఈరోజు స్వల్పంగా పెరిగింది. బుధవారం క్వింటా పత్తి ధర రూ.7,550 పలుకగా.. గురువారం రూ.50 పెరిగి రూ.7,600 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. నేడు మార్కెట్‌కు రైతులు 25 వాహనాల్లో 206 క్వింటాళ్ల విడి పత్తిని తీసుకువచ్చినట్లు చెప్పారు. మార్కెట్‌కు పత్తిని తీసుకువచ్చే రైతులు నాణ్యత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


