News September 3, 2025
KNR: ‘పాఠశాల విద్యలో జిల్లా ఆదర్శంగా నిలవాలి’

పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ముందుస్తుగా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. పాఠశాల విద్యలో రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాను ఆదర్శంగా నిలువాలని పేర్కొన్నారు. విద్యా రంగంలో ఉపాధ్యాయుల సేవలు వెల కట్టలేనివని, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు.
Similar News
News September 5, 2025
KNR: బాలికల భద్రతా కార్యక్రమాలు భేష్!

కరీంనగర్ జిల్లా కేంద్రంలో బాలికల భద్రత, విద్య, అభివృద్ధి, జీవన నైపుణ్యం కోసం జిల్లాలో చేపడుతున్న వాయిస్ ఫర్ గర్ల్స్, స్నేహిత వంటి కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు యుగాండా దేశపు “గర్ల్ ఆఫ్ ఉగాండా” సంస్థ ప్రతినిధుల బృందం జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలను గురువారం సందర్శించింది. బధిరుల ఆశ్రమం వంటివాటిపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. చైల్డ్ హెల్ప్ లైన్ 1098పై విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్నారు.
News September 5, 2025
కొత్తపల్లి- హుస్నాబాద్ 4 లైన్ పనులపై కలెక్టర్ సమీక్ష

KNR(కొత్తపల్లి)- హుస్నాబాద్ నాలుగు వరుసల రహదారి నిర్మాణం వేగవంతం కోసం అవసరమైన చర్యలపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సంబంధిత అధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 4వరుసల రహదారికి ఇప్పటికే మార్కింగ్ పూర్తయినందున ఎలక్ట్రికల్ వర్క్స్, బావుల పూడ్చివేత, చెట్లు కత్తిరించడం వంటి పనులను వేగవంతం చేయాలన్నారు. గ్రామసభలు ఏర్పాటు చేసి తీర్మానం చేయాలన్నారు.
News September 5, 2025
KNR: ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

KNR జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ఎప్పటికప్పుడు EVM, వీవీ ప్యాట్ గోదాంను తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు. EVMల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.