News January 8, 2026

KNR: పార్టీని వీడిన సంజయ్.. మున్సిపల్ వేళ కారుకు పంక్చర్!

image

జగిత్యాల BRSలో నాయకత్వ లోపం కనిపిస్తోంది. ఎమ్మెల్యే సంజయ్ BRSను వీడటంతో కేడర్‌ను సమన్వయం చేసే నాయకుడు లేక పార్టీ బలహీనపడుతోంది. గత సర్పంచ్ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలగా, మున్సిపల్ ఎన్నికల వేళ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండాల్సిన ఎల్.రమణ మౌనం వహించడం హాట్ టాపిక్‌గా మారింది. భవిష్యత్తుపై భరోసా ఇచ్చే వారు లేక గులాబీ నాయకులు ఇతర పార్టీలపై మెుగ్గు చూపుతున్నారు.

Similar News

News January 9, 2026

శ్రీకాకుళం: సంక్రాంతి ముందు..ప్రయాణికులకు షాక్

image

శ్రీకాకుళం ఆర్టీసీ హైయర్ బస్సు యజమానులు గురువారం జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణకు సమ్మె నోటీస్ అందజేశారు. ఈనెల 12 నుంచి సమ్మె చేయనున్నట్లు నోటీసులో ప్రస్తావించారు. మహిళల ఉచిత బస్సు పథకం స్త్రీ శక్తి‌లో భాగంగా బస్సుకు నెలకు అదనంగా రూ.20 వేలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఆక్యుపెన్సీ పెరిగినా గిట్టుబాటు ధర చెల్లించడం లేదని, ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

News January 9, 2026

విడుదలైన కొత్త వంగడాలు.. రైతులకు ఎన్నో లాభాలు

image

నువ్వులు, సజ్జ, పొగాకు, వరిగ పంటల్లో కొత్త వంగడాలను ఆచార్య N.G.రంగా అగ్రికల్చర్ వర్సిటీ అభివృద్ధి చేసింది. వీటిని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తాజాగా జాతీయ స్థాయిలో విడుదల చేశారు. అధిక దిగుబడినిచ్చే YLM 146 నువ్వుల వంగడం, ఎక్కువ పోషకాలు గల APHB 126 సజ్జ, PMV 480(అల్లూరి) వరిగ, ABD 132 బీడీ పొగాకు వంగడాలు విడుదలయ్యాయి. వీటి ప్రత్యేకత తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.

News January 9, 2026

‘కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు పటిష్ఠంగా అమలు చేయాలి,

image

స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్య సాధన దిశగా కేంద్ర ప్రాయోజిత పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా, సమర్థవంతంగా అమలు చేయాలని 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో 20 పాయింట్ ఫార్ములా అమలుపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి, తదితరులు పాల్గొన్నారు.