News August 23, 2025

KNR: పిల్లలకు భోజనాన్ని వడ్డించిన కలెక్టర్

image

దుర్షెడు అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. పూర్వ ప్రాథమిక విద్య నేర్చుకుంటున్న చిన్నారులతో ముచ్చటించారు. వారందరికీ రోజువారీగా అందించే భోజనాన్ని స్వయంగా వడ్డించారు. సిలబస్ ప్రకారం పూర్వ ప్రాథమిక విద్య బోధించాలని అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు. క్రమం తప్పకుండా పిల్లల బరువు, ఎత్తు కొలవాలని అన్నారు. అనంతరం గర్భిణీలకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు.

Similar News

News August 23, 2025

హుజురాబాద్: జోరుగా చేరికల పరంపర

image

HZB నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పరంపర మొదలైంది. జమ్మికుంట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు HZB MLA కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో BRSలో చేరగా.. మరోవైపు ఇదే మండలంలోని ఫ్యాక్స్ చైర్మన్, ఓ మాజీ సర్పంచ్ ప్రణవ్ సమక్షంలో కాంగ్రెసులో చేరారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే చేరికలు మొదలవడంతో నాయకులు ఏరోజు ఏ పార్టీలో ఉంటారో తెలియదు అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

News August 22, 2025

KNR: వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలకు సబ్సిడీ

image

వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ స్మామ్–2025 పథకం కింద 2,822 బ్యాటరీ, మాన్యువల్ ఆపరేటెడ్ స్ప్రేయర్లు, 481 పవర్ స్ప్రేయర్లు, 188 రోట వేటర్లు, 32 సీడ్ కంఫెర్టిలైజర్ డ్రిల్లర్లు, ఇతర పరికరాలు ఉన్నాయన్నారు. చిన్న, సన్నకారు, మహిళా, SC, ST రైతులకు 50% సబ్సిడీ, ఇతర రైతులకు 40% సబ్సిడీ కల్పించనున్నట్టు తెలిపారు.

News August 22, 2025

కాచాపూర్: ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

image

శంకరపట్నం మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన తడిగొప్పుల పోచయ్య కడుపు నొప్పితో బాధపడుతూ గురువారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులు గమనించి కేశవపట్నం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోచయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.