News October 3, 2025
KNR: పెరగనున్న మహిళా ప్రాతినిధ్యం..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్ అమలు చేయడంతో మహిళల స్థానాలు విపరీతంగా పెరగనున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 16,42,542 మహిళా ఓటర్లుండగా.. ఇందులో 30 ZPTC స్థానాలకు, 30 MPP స్థానాలకు, 323 MPTC స్థానాలకు, 615 గ్రామపంచాయతీలకు, 6,463 వార్డు సభ్యుల స్థానాలకు మహిళలు ప్రాతినిధ్యం వహించనున్నారు. తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళలకు సముచిత గౌరవం దక్కనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News October 3, 2025
శ్రీకాకుళం: మునిగిన రోడ్డు.. సాహసం చేశారు!

భారీ వర్షాలకు నందిగామ మండలం ఉయ్యాలపేట వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరింది. ఆ గ్రామానికి 108 అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడిని ఆసుపత్రికి తరలించేందుకు స్థానికులు సాహసం చేశారు. కర్రకు డోలీ కట్టి మెయిన్ రోడ్డు వరకు ఆయనను మోసుకెళ్లారు.
News October 3, 2025
తిరుపతిలో బాంబు బెదిరింపు మెయిల్స్!

AP: తిరుపతిలో బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం రేపాయి. పలుచోట్ల RDX బాంబులు పెట్టినట్లు దుండగులు మెయిల్స్ పంపారు. “హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్” పేరిట వచ్చిన వీటిపై అధికారులు అలర్టయ్యారు. తిరుపతి, శ్రీకాళహస్తి, అలిపిరి, తిరుచానూరులో భద్రతా విభాగాలు సోదాలు చేపట్టాయి. 2024 అక్టోబర్లో కూడా ఇవే రకమైన మెయిల్స్ రాగా అధికారుల తనిఖీల్లో బూటకపు బెదిరింపుగా తేలింది.
News October 3, 2025
బియ్యం పురుగుపట్టకుండా ఉండాలంటే?

* ఉల్లిపాయ ముక్కలు వేయించేటప్పుడు అందులో కొంచెం పాలు కలిపితే ముక్కలు నల్లబడవు.
* ఇడ్లీ, దోశల పిండిలో రెండు తమలపాకులు వేసి ఉంచితే తాజాగా ఉంటుంది.
* బియ్యం పోసుకునే బాక్సులో నాలుగు ఎండు మిరపకాయలను ఉంచితే పురుగు పట్టదు.
* కోడిగుడ్లను ఉడకబెట్టే నీటిలో ఒక స్పూన్ వెనిగర్ కలిపితే గుడ్డు పగిలినా అందులోని పదార్థం బయటకు రాదు.
<<-se>>#VantintiChitkalu<<>>