News October 7, 2025

KNR: పొన్నం వ్యాఖ్యలపై రాజుకుంటున్న రగడ

image

మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేకపై మరోమంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహంగా ఉన్నారట. జూబ్లీహిల్స్‌లో ఓ కార్యక్రమంలో తనను <<17935655>>బాడి షేమింగ్<<>> చేస్తూ చేసిన వ్యాఖ్యలపై సీఎంకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారట. వివేక్ ఓ అహంకారి అని తనకు మంత్రిపదవి రావడం ఆయనకు ఇష్టంలేదని, అలాగే పొన్నంకు శ్రీధర్ బాబు అంటే గిట్టదని, ఇలాంటి పరిస్థితులతోనే ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని సన్నిహితుల వద్ద లక్ష్మణ్ వాపోయారట.

Similar News

News October 7, 2025

డ్రోన్‌ సిటీకి ప్రధానితో శంకుస్థాపన

image

ఈ నెల 16న కర్నూలు పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ డ్రోన్ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. డిసెంబరులో డ్రోన్‌ షోను నిర్వహించాలని సూచించారు. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు కలిగే లబ్ధిని వివరించేందుకు ప్రధాని జిల్లా పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే.

News October 7, 2025

PM మోదీ ఆసక్తికర పోస్ట్

image

తాను 2001లో ఇదే రోజు మొదటిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘నా తోటి భారతీయుల నిరంతర ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. నేను ప్రభుత్వ అధిపతిగా 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాను. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి, దేశ పురోగతికి తోడ్పడటానికి నేను నిరంతరం ప్రయత్నిస్తున్నాను. మీ మద్దతుకు కృతజ్ఞతలు’ అని తన ఫొటోలను షేర్ చేశారు.

News October 7, 2025

‘EPC-టర్న్‌కీ’ విధానంలో ప్యారడైజ్-శామీర్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్

image

ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ ORR వరకు 18 KMల 6-లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని అత్యంత కఠినమైన ‘EPC-టర్న్‌కీ’ విధానంలో HMDA చేపట్టనుంది. ఈ విధానంలో డిజైన్ నుంచి నిర్మాణం, ఆలస్యం రిస్క్ మొత్తం కాంట్రాక్టర్‌దే. గంటకు 100KM వేగంతో ప్రయాణించేలా నిర్మించాల్సిన ఈప్రాజెక్టును కేవలం 24నెలల్లో పూర్తి చేయాలని గడువు విధించారు. ఇందులో At-గ్రేడ్ రోడ్ సెక్షన్ ఉండే 6.522 KMపొడవైన టన్నెల్ నిర్మాణం ముఖ్య భాగం.