News January 10, 2026
KNR: ‘పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి’

మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌లోని పలు పోలింగ్ కేంద్రాలను శుక్రవారం ఆయన తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల మధ్య నిర్ధేశిత దూరాన్ని పాటించాలని, విద్యుత్, తాగునీరు, లైటింగు, వికలాంగుల సౌకర్యార్థం ర్యాంపులను ఏర్పాటుచేయాలన్నారు.
Similar News
News January 28, 2026
కరీంనగర్: 3 రోజులే గడువు.. బీ-ఫామ్ ఎవరికో?

మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో బీ-ఫామ్ ఎవరికీ దక్కనుందని అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో గెలుపు గుర్రాలను ఎంపికలో ప్రధాన పార్టీల్లో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ అధిష్ఠానం గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని బీ-ఫామ్ కేటాయించనున్నారు. కొందరు ఆశావహులు పార్టీలు మారే ప్రయత్నాల్లో ఉన్నారు. ఏం జరుగుతుందో చివరి క్షణం వరకు చూడాలి.
News January 27, 2026
KNR: ‘మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తాం’

కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మొత్తం 66 డివిజన్లకు 33 ఆర్వో కేంద్రాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈనెల 28 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, అభ్యర్థితో పాటు ఇద్దరికే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
News January 27, 2026
KNR: సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు బలగాల మోహరింపు

కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 25 నుంచి 30 శాతం పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. ఈ ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీస్ శాఖ అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందని, ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.


