News October 16, 2025
KNR: పోలీసులకు లొంగిపోయిన మేటాఫండ్ నిర్వాహకుడు..?

ఉమ్మడి KNRలో మేటాఫండ్ మనీ సర్క్యూలేషన్ బిజినెస్ నిర్వహించిన HYDవాసి లోకేశ్ KNR పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం. KNR, JGTLలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న లోకేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రూ.లక్షకు రూ.3లక్షలు వస్తాయని నమ్మించి ఉమ్మడి జిల్లాలో మేటాఫండ్ పేరిట ట్రేడింగ్ చేసి రూ.వందల కోట్లు లోకేశ్ కొల్లగొట్టాడు. బాధితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, వ్యాపారస్థులు ఉన్నట్లు తెలుస్తోంది. SHARE
Similar News
News October 16, 2025
BHPL: అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు!

ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎస్పీ కిరణ్ ఖరేలు అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లాలోని ఇందిరమ్మ ప్రభుత్వ కాంట్రాక్టు నిర్మాణాలకు కావాల్సిన ఇసుకరవాణాపై నేడు రివ్యూ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలను తప్పితే ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. క్వారీలలో
అక్రమాలు లేకుండా చూడాలన్నారు.
News October 16, 2025
బిగ్‌బాస్ షోను నిలిపివేయాలని పోలీసులకు ఫిర్యాదు

TG: బిగ్‌బాస్ సమాజానికి, ముఖ్యంగా యువతకు తప్పుడు సందేశం ఇస్తోందని గజ్వేల్‌కు చెందిన యువకులు జూబ్లీహిల్స్ PSలో ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్ నిర్వాహకులు సమాజం సిగ్గు పడే విధంగా అభ్యంతరకరమైన కంటెంట్‌తో షో నిర్వహిస్తున్నారని, సమాజంలో విలువలు లేనివారిని ఎంపిక చేస్తున్నారని తెలిపారు. కర్ణాటక తరహాలో ఇక్కడా ఆ షోను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బిగ్‌బాస్ హౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
News October 16, 2025
కరీంనగర్ గిన్నప్ప రుచి వేరు..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నో వంటకాలు ఉన్నప్పటికీ సర్వపిండి(గిన్నప్ప) చాలా స్పెషల్. గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిపై చేసిన సర్వపిండి తింటే ఆ రుచి ఎప్పటికీ మరువరు. ఇది ప్రస్తుతం నగరాల్లోకి వ్యాపించింది. కర్రీ పాయింట్లలో రూ.10-20 చొప్పున ఒక సర్వపిండి విక్రయిస్తున్నారు. ఈ జనరేషన్‌తో పోలిస్తే 90’sలో స్కూల్‌కు వెళ్లొచ్చేలోపు ఇంటి వద్ద అమ్మ చేసిన సర్వపిండి రెడీగా ఉండేది. నేడు ప్రపంచ భోజన దినోత్సవం.