News October 22, 2025
KNR: పోలీసులకు వ్యాసరచన పోటీలు

KNR కమిషనరేట్ కేంద్రంలో జరుగుతున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బందికి రెండు కేటగిరీలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో పోలీస్ కానిస్టేబుల్ నుండి ఏఎస్సై వరకు గల సిబ్బందికి “పని ప్రదేశంలో లింగ వివక్ష” అనే అంశంపై, ఎస్సై, ఆపై స్థాయి అధికారులకు “క్షేత్ర స్థాయిలో పోలీసింగ్ బలోపేతం చేయడం” అనే అంశంపై పోటీలు నిర్వహించారు. మొత్తం 117మంది పోలీసులు పాల్గొన్నారు.
Similar News
News October 23, 2025
సైకిల్ ర్యాలీ పోస్టర్, రూట్ మ్యాప్ ఆవిష్కరించిన KNR సీపీ

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న 20 కి.మీ సైకిల్ ర్యాలీ పోస్టర్, రూట్ మ్యాప్‌ను సీపీ గౌస్ ఆలం కమిషనరేట్‌లో ఆవిష్కరించారు. 25న ఉదయం ఈ ర్యాలీ పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమై, 20 కి.మీ ప్రయాణించి, తిరిగి అక్కడే ముగుస్తుందని తెలిపారు. ఈ సైక్లింగ్ ర్యాలీలో ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సీపీ పిలుపునిచ్చారు.
News October 23, 2025
ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కనుకులగిద్ద యువకుడు

హుజురాబాద్ మండలం కనుకులగిద్దకి చెందిన మొగిలిచర్ల కిషోర్ 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. గ్రామానికి వన్నె తెచ్చిన కిషోర్‌ను కనుకులగిద్ద డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో సన్మానించారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అకుంటిత దీక్షతో 5 ఉద్యోగాలు సాధించిన కిషోర్ గ్రామానికే గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. కిషోర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని గ్రామ యువతకు సూచించారు.
News October 22, 2025
కరీంనగర్: షార్ట్‌ఫిల్మ్, ఫొటోగ్రఫీ పోటీలు: CP

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పోలీసులకు సంబంధించిన అంశాలపై షార్ట్‌ఫిల్మ్, ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నట్లు KNR CP గౌస్ ఆలం తెలిపారు. ప్రజలు రూపొందించిన షార్ట్‌ఫిల్మ్‌లు, ఇటీవల తీసిన ఫొటోలను నేటి నుంచి OCT 28 వరకు కమిషనరేట్ కార్యాలయంలోని ఐటీ కోర్ కార్యాలయంలో అందజేయాలని ఆయన సూచించారు. పోటీలలో ఉత్తమంగా నిలిచిన ముగ్గురిని ఎంపిక చేసి వారికి బహుమతులు అందజేయనున్నట్లు సీపీ వెల్లడించారు.