News February 19, 2025
KNR: పోలీసుల కస్టడీలో నిందితులు

కరీంనగర్ పట్టణం కట్టరాంపూర్‌కు చెందిన సర్వే నంబర్ 954లో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి తప్పుడు హద్దులు చూపుతో భూమిని పలువురికి విక్రయించిన ఘటనలో 13 మందిపై కేసు నమోదు చేసిన ఘటనలో నిందితులను కస్టడీలోకి తీసుకున్నామని కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు తెలిపారు. వీరి ఇళ్లలో మంగళవారం ఉదయం నుంచి సోదాలు చేసి పలు కీలకమైన డాక్యుమెంట్లను కరీంనగర్ వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ బి.కోటేశ్వర్, ఎస్ఐ రాజన్న స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News February 20, 2025
KNR: బెంగళూరు వెళ్లేవారికి 10% రాయితీ: RM

కరీంనగర్, గోదావరిఖని డిపో నుంచి బెంగళూరుకు నడిచే ఆర్టీసీ బస్సు సర్వీసులలో ప్రయాణించే ప్రయాణీకులకు వారి బస్ ఛార్జీలో 10% రాయితీ కల్పించినట్లు కరీంనగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి.రాజు ఒక ప్రకటనలో తెలిపారు. బెంగళూరుకు ప్రయాణించే ప్రయాణీకులు 10% రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News February 20, 2025
KNR: మార్చి 5 నుంచి 22 వరకు ఇంటర్ పరీక్షలు: జిల్లా విద్యాధికారి

మార్చి 5 నుంచి 22 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయని జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం 10 ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఇంటర్ ప్రథమ సంవత్సరం 17799, ద్వితీయ సంవత్సరానికి 17763 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. మొత్తం 58 సెంటర్లు ఏర్పాటు చేశామని కరీంనగర్లో 37 సెంటర్లు ఉన్నాయన్నారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
News February 20, 2025
KNR: బీర్లకు ఎమ్మార్పీ 210.. అమ్మేది 260

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతి బీరు 30 రూపాయలు పెంచింది. అయితే కరీంనగర్ పట్టణంలో మాత్రం ఎమ్మార్పీ ధర పాత రేట్లే ఉండగా కొత్త ధరలకు అమ్ముతున్నారు. బడ్ వైజర్ బీరు 210 ఉండగా బార్ ఓపెన్ సిట్టింగుల్లో 260 రూపాయలను తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం పెంచిన ధరకు అమ్మే రేట్లలో వ్యత్యాసం ఉండటంతో మందుబాబులు ఆందోళన వ్యక్తం చేశారు. బీర్ బాటిల్ పైన ఉన్న రేట్లు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.