News August 20, 2025
KNR: ప్రభుత్వం స్కూల్లో ఫ్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్

అంగన్వాడీ కేంద్రాలను ఫ్రీ ప్రైమరీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లో 34 పాఠశాలలను గుర్తించి వాటిలోని అంగన్వాడీ కేంద్రాలను తరలించి ఫ్రీ ప్రైమరీ విద్య అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా KNR జిల్లాలో ఇల్లందకుంట మం. వాగొడ్డు రామన్నపల్లి, వీణవంక మం. దేశాయిపల్లి, తిమ్మాపూర్ మం. గొల్లపల్లి, గంగాధర మం. సర్వారెడ్డిపల్లి పాఠశాలలను ఎంపిక చేశారు.
Similar News
News August 20, 2025
KNR: ‘కలెక్టరేట్, ఆసుపత్రిలో పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి’

కలెక్టరేట్‌తో పాటు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఈ రెండు కార్యాలయాలను సందర్శించిన ఆయన, పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షించారు. ఎక్కడైనా చెత్త కనిపించకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని కమిషనర్ హెచ్చరించారు.
News August 20, 2025
KNR: ‘పారిశ్రామిక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి’

స్థానిక SRR కళాశాలలో కామర్స్ & బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం వారు కామర్స్ విద్యార్థులకు ప్రొఫెషనల్ కోర్సులైన సీఏ, సీఎంఏల పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రతినిధి గుర్రం అశోక్ కుమార్ మాట్లాడుతూ.. డిగ్రీతోపాటు సీఏ, సీఎంఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులను పూర్తి చేసిన కామర్స్ విద్యార్థులకు ప్రస్తుత వ్యాపార, పారిశ్రామిక రంగాలలో అత్యున్నత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
News August 20, 2025
కరీంనగర్: వివాహిత అనుమానాస్పద మృతి

కరీంనగర్ భగత్ నగర్లో భావన(మానస) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. తన భర్త జ్ఞానేశ్వర్ అర్ధరాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి ఉరి వేసుకుని ఉందని, ఆసుపత్రికి తీసుకెళ్దామని ఆమెను కిందికి దించుతుండగా, అప్పటికే మృతి చెందిందని చెప్పారు. పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.