News November 3, 2025
KNR: ప్రమాదాల కేంద్రంగా రోడ్లు.. హెవీ లోడ్స్‌తో చిద్రం

గ్రానైట్, ఇసుక రవాణాకు కేంద్రంగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హెవీ లోడ్ వాహనాలు నిత్యం వందలాదిగా తిరుగుతున్నాయి. ఇసుక, గ్రానైట్ లోడ్‌లతో రోడ్లు చిద్రమై వాహనదారులకు ప్రయాణం నరకంగా మారింది. మంథని-పెద్దపల్లి, కరీంనగర్ నుంచి చల్లూర్, WGL. JGTL, సిరిసిల్ల, హుస్నాబాద్ మార్గాల్లో పరిస్థితి దారుణం. ప్రమాదాల నియంత్రణకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోకుంటే, రంగారెడ్డి ఘటనలు ఇక్కడ పునరావృతమయ్యే ప్రమాదం ఉంది.
Similar News
News November 3, 2025
కలెక్టర్‌ను కలిసిన ఎంజీఎం సూపరింటెండెంట్

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన డా. పి. హరీష్ చంద్రారెడ్డి కలెక్టర్ డా. సత్య శారదను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. ఈ సందర్భంగా ఎంజీఎం అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు, రోగులకు అందించాల్సిన మెరుగైన సేవలపై కలెక్టర్, సూపరింటెండెంట్‌కు సూచనలు చేశారు.
News November 3, 2025
కరెంట్, రోడ్లు అడిగితే చనిపోతారని చెప్పేవాళ్లు: మోదీ

దశాబ్దాలపాటు బిహార్‌ను కష్టాల్లో ఉంచిందని ఆర్జేడీపై ప్రధాని మోదీ మండిపడ్డారు. ‘ఆ పార్టీకి అభివృద్ధి వ్యతిరేక చరిత్ర ఉంది. రోడ్లు నిర్మిస్తే ప్రమాదాలు జరుగుతాయని, కరెంటు సరఫరా చేస్తే షాక్‌కు గురై చనిపోతారని ప్రజలకు ఆర్జేడీ నాయకులు చెప్పేవాళ్లు’ అని విమర్శించారు. నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో సుపరిపాలన అందించామని, రాష్ట్రానికి వందే భారత్ రైళ్లు, రోడ్లు తీసుకొచ్చామని కటిహార్‌లో ఎన్నికల ప్రచారంలో అన్నారు.
News November 3, 2025
గ్రామాల్లో నీటి సమస్య ఉండకూడదు: కలెక్టర్

గ్రామాల్లో ఎక్కడా నీటి సమస్యలు ఉండకూడదని కలెక్టర్ డా.ఏ.సీరి ఆర్ డబ్ల్యుూఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్ నుంచి ఆమె పలు అంశాలపై మండల స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు. రెవెన్యూ శాఖ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.


