News November 10, 2025

KNR: ఫుడ్ పాయిజన్ ఘటనపై బండి సంజయ్ ఆరా

image

జమ్మికుంట ప్రాథమిక పాఠశాలలో జరిగిన <<18250681>>ఫుడ్ పాయిజన్ ఘటన<<>>పై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ఆయన ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆమెను అడిగి తెలుసుకున్నారు. కాగా, ప్రస్తుతం పిల్లల ఆరోగ్యం నిలకడగానే ఉందని కలెక్టర్ మంత్రికి వివరించారు. మెరుగైన చికిత్స కోసం KNR ఆసుపత్రికి తరలించాలన్నారు.

Similar News

News November 10, 2025

GNT: అనుచిత పోస్టులు.. హైదరాబాద్‌లో అరెస్ట్

image

ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రిపై అసభ్యకర పోస్టులు పెట్టిన తుపాకుల సతీష్ కుమార్‌ను పాత గుంటూరు పోలీసులు సాంకేతిక ఆధారాలతో గుర్తించి హైదరాబాద్‌లోని జీడిమెట్లలో అరెస్ట్ చేశారు. అతడిని రిమాండ్‌కు తరలించారు. ఎవరైనా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ హెచ్చరించారు.

News November 10, 2025

HNK: అగ్ని వీరుల ఎంపిక ప్రక్రియ విధానం ఇలా..!

image

అగ్ని వీరుల ఎంపిక కోసం ప్రతి బ్యాచ్‌లో 100 మంది అభ్యర్థులు పాల్గొని 1600 మీటర్ల (నాలుగు రౌండ్లు) దూరం పరిగెడతారు. ప్రదర్శన ఆధారంగా వర్గీకరణ: బ్యాచ్ 1: 5 నిమిషాల 30 సెకన్ల లోపు -60 మార్కులు, బ్యాచ్ 2: 5:31-5:45 నిమిషాలు-48 మార్కులు, బ్యాచ్ 3: 5:46-6:00 నిమిషాలు-36 మార్కులు, బ్యాచ్ 4: 6:01-6:15 నిమిషాలు-24 మార్కులు ఉంటాయి.

News November 10, 2025

NLG: ర్యాగింగ్‌పై ఉక్కుపాదం: ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌

image

ర్యాగింగ్‌ అనే విష సంస్కృతికి విద్యార్థులు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో యాంటీ ర్యాగింగ్‌పై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ర్యాగింగ్‌కు పాల్పడి తోటి విద్యార్థుల జీవితాలను నాశనం చేయవద్దని, అలా చేస్తే, ప్రొహిబిషన్‌ ర్యాగింగ్‌ యాక్ట్‌ కింద 6 నెలల నుంచి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు.