News August 24, 2025
KNR: బతుకమ్మ కానుకగా మహిళలకు 2 చీరలు..!

బతుకమ్మ పండగకు మహిళా పొదుపు సంఘాల సభ్యులకు 2చీరల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.318కోట్లను కేటాయించింది. ఇందిరా మహిళాశక్తి స్కీంలో భాగంగా 65లక్షల చీరల తయారీకి SRCL నేతన్నలకు ఆర్డర్ ఇచ్చింది. కాగా, 2.30కోట్ల మీటర్ల వస్త్రంతో 30లక్షల చీరలు ఇప్పటికే పూర్తయ్యాయి. 2షిఫ్టుల్లో 6వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
Similar News
News August 24, 2025
రేపు వరంగల్ మార్కెట్ ప్రారంభం

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున:ప్రారంభం కానుంది. శనివారం అమావాస్య, ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
News August 24, 2025
కర్నూలు: ఈనెల 29న సరిహద్దుల మార్పు కోసం విజ్ఞప్తుల స్వీకరణ

ఉమ్మడి జిల్లాకు సంబంధించి కర్నూలు సునయన ఆడిటోరియంలో 29న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మండల, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పు కోసం అభ్యర్థనలు స్వీకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. జిల్లా, మండల, గ్రామాల పేర్లు, అలాగే వాటి సరిహద్దులు మార్పు కోసం ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి ఈనెల 29న రాష్ట్ర మంత్రుల బృందం విజ్ఞప్తులను స్వీకరిస్తారని నంద్యాల కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు.
News August 24, 2025
సైక్లింగ్‌తో సంపూర్ణ ఆరోగ్యం: కడప SP

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని కడప ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఊటుకూరు సర్కిల్ నుంచి మౌంట్ ఫోర్ట్ స్కూల్ వరకు ఆదివారం సైక్లింగ్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సైక్లింగ్ సహజ సిద్ధమైన వ్యాయామని చెప్పారు. అందరూ వ్యాయామంతో పాటు సైక్లింగ్ కూడా అలవాటు చేసుకోవాలని కోరారు.