News September 20, 2025
KNR: బతుకమ్మ, దసరా పండుగకు బస్సులు ఏర్పాట్లు

బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ KNR RM బి.రాజు తెలిపారు. నేటి నుంచి OCT 1వ తేదీ వరకు JBS నుంచి KNRకు 1321 బస్సులు, OCT 2వ తేదీ నుంచి 13 తేదీ వరకు KNR నుంచి JBSకు 1330 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణీకులు ఈ ప్రత్యేక బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రిజర్వేషన్ కోసం వెబ్సైట్ www.tgsrtcbus.in ను సంప్రదించాలని సూచించారు.
Similar News
News September 20, 2025
మంత్రులు, న్యాయ నిపుణులతో నేడు సీఎం భేటీ

TG: స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై ఈ సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులకు సమాచారం అందించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు గడువు దగ్గర పడుతుండటం, బీసీ రిజర్వేషన్ల అంశంలో న్యాయపరమైన ఇబ్బందులపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి న్యాయ నిపుణులు కూడా రావాలని CMO నుంచి సమాచారం ఇచ్చారు.
News September 20, 2025
అక్షర్‌కు గాయం.. రేపటి మ్యాచులో ఆడతాడా?

ఒమన్‌తో మ్యాచులో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ రేపు పాక్‌తో జరిగే మ్యాచులో ఆడటంపై అనుమానాలున్నాయి. నిన్న బౌండరీ వద్ద క్యాచ్ కోసం ప్రయత్నిస్తుండగా అక్షర్ తలకు గాయమైంది. వెంటనే ఆయన మైదానాన్ని వీడారు. దీంతో ఆయన రేపటి మ్యాచులో పాల్గొంటారా లేదా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఒకవేళ అక్షర్ దూరమైతే భారత్ ఇద్దరు స్పిన్నర్లతోనే (కుల్దీప్, వరుణ్) ఆడాల్సి వస్తుంది.
News September 20, 2025
Future Cityకి పునాది ఎప్పుడంటే?

TG: దసరా సందర్భంగా సెప్టెంబర్ 25 లేదా 26న రంగారెడ్డి జిల్లాలోని మీర్‌ఖాన్‌పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) హెడ్ ఆఫీస్‌కు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. రూ.5 కోట్లతో ప్రీకాస్ట్ టెక్నాలజీతో కేవలం మూడు నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నాగార్జునసాగర్, శ్రీశైలం హైవేలకు అనుసంధానంగా కొత్త రోడ్డు కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.