News August 13, 2025

KNR బస్ స్టేషన్‌లో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ

image

KNR బస్ స్టేషన్ ఆవరణలోని రీజనల్ మేనేజర్ కార్యాలయ సముదాయంలో KNR RM బి. రాజు, డిప్యూటీ RM లు ఎస్.భూపతిరెడ్డి, పి.మల్లేశం సిబ్బందితో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ, ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా వుండడానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ ఆఫీసర్ జి.సత్యనారాయణ, పర్సనల్ ఆఫీసర్ కార్యాలయ సూపరింటెండెంట్ బి.సత్తయ్య తదితరులున్నారు.

Similar News

News August 14, 2025

BREAKING.. నల్లగొండ: పోక్సో నింధితుడికి ఉరి శిక్ష

image

నల్లగొండలో పోక్సో ఇన్‌ఛార్జి న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు మహమ్మద్ ముక్రంకు ఉరి శిక్షతో పాటు రూ.1.10 లక్షల జరిమానా విధించింది. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందించాలని న్యాయమూర్తి రోజా రమణి తీర్పు వెల్లడించారు.

News August 14, 2025

విశాఖ జిల్లాలో 165 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

image

జిల్లాలో గడిచిన 24 గంటల్లో 165.2 మి.మీల వర్షపాతం నమోదయింది. అత్యధికంగా పద్మనాభం మండలంలో 51.4mm, అత్యల్పంగా ములగడలో 5.6mm వర్షపాతం నమోదయింది. పెందుర్తిలో 18.2, భీమునిపట్నంలో 14.2 మి.మీ వర్షపాతం కురిసింది. రానున్న రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

News August 14, 2025

భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

image

బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా కలెక్టర్ హరేంధీర ప్రసాద్ గురువారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా నియంత్రించాలని కోరారు. తాగునీరు కలుషితం కాకుండా లీకేజీలు సమస్యలు పరిష్కరించాలని సూచించారు.