News April 6, 2025

KNR: బీజేపీ జెండా ఎగరవేసిన జిల్లా అధ్యక్షుడు

image

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగడి కృష్ణారెడ్డి తన ఇంటిపై పార్టీ జెండాను ఎగరవేశారు. కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులతో కలిసి ఆయన బీజేపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. పార్టీ పిలుపు మేరకు జిల్లాలోని ప్రతి కార్యకర్త బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తమ ఇంటిపై కాషాయ జెండాలు ఎగరవేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News April 8, 2025

KNR: ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్

image

జిల్లా కేంద్రo కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదామ్‌ను మంగళవారం అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను తనిఖీచేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నామన్నారు. ఈవీఎంల భద్రతకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోదాం వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరాతీశారు.

News April 8, 2025

KNR: శిక్షణను సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలి: కలెక్టర్

image

జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రైవేట్ విద్యాసంస్థల సహకారంతో ప్రభుత్వ విద్యార్థులకు ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అల్ఫోర్స్ విద్యాసంస్థ సహకారంతో వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఒలంపియాడ్‌లో శిక్షణ ఇప్పించారు. ఈ పరీక్ష రాసి మెరిట్ సాధించిన విద్యార్థులకు ఈరోజు మెడల్స్, సర్టిఫికెట్స్ కలెక్టర్ అందజేశారు.

News April 8, 2025

కొండగట్టులో నాసిరకం ప్రసాదం.. ప్రజావాణిలో ఫిర్యాదు

image

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో పులిహోర, అన్న ప్రసాదంలో నాసిరకం సరకులు వినియోగిస్తున్నారని కొండగట్టు మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడు పోచమ్మల ప్రవీణ్ సోమవారం జగిత్యాల కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రానున్న హనుమాన్ జయంతికి లక్షలాదిమంది వస్తుండగా వారికి నాసిరకం వస్తువులతో తయారు చేసిన పులిహోర, లడ్డు, అన్నప్రసాదం అందజేస్తే ఆలయ ప్రతిష్ఠ దిగజారే అవకాశం ఉందన్నారు.

error: Content is protected !!