News March 19, 2025
KNR: బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం

ఉమ్మడి KNR జిల్లాలోని 6, 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మహాత్మాజ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాల సంస్థ రీజినల్ కో ఆర్డినేటర్ అంజలి కుమారి తెలిపారు. మార్చి 31 వరకు ఆన్‌లైన్, మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. www.mjptbcwreis.telangana.gov.in వెబ్సైట్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
Similar News
News March 19, 2025
ఇంటర్ పరీక్షల సరళిని పరిశీలించిన జనగామ కలెక్టర్

జనగామ పట్టణ కేంద్రంలోని సాంఘిక సంక్షేమ పాఠశాల, జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్ష సరళిని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ బుధవారం పరిశీలించారు. కళాశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల గురించి, పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు సెంటర్లో ఏర్పాటు చేసిన మౌలిక వసతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఐఈఓ జితేందర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ రావు తదితరులున్నారు.
News March 19, 2025
కమనీయం.. భద్రాద్రి రామయ్య నిత్యకల్యాణం

భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి నిత్యకళ్యాణ వేడుక బుధవారం వేద పండితులు కమనీయంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేసి, స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించి, స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకళ్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
News March 19, 2025
పాత ఫోన్.. గంటకు పైగా ఛార్జ్ చేస్తే పేలే ప్రమాదం

పాత ఫోన్లు కొనొద్దని నిపుణులు సూచిస్తున్నారు. వాటిలోని చెడిపోయిన బ్యాటరీ స్థానంలో క్వాలిటీ లేని చైనా బ్యాటరీని అమర్చుతారని చెబుతున్నారు. అలాంటి బ్యాటరీని గంటకు పైగా ఛార్జ్ చేస్తే వేడెక్కి పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే ఫోన్‌ను ఎక్కువ సేపు ప్లగ్ ఇన్ చేసి ఉంచకూడదంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్ జిల్లాలో సెకండ్ హ్యాండ్ మొబైల్ పేలి ఓ యువకుడికి తీవ్రగాయాలయ్యాయి.