News March 19, 2025
KNR: బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం

ఉమ్మడి KNR జిల్లాలోని 6, 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మహాత్మాజ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాల సంస్థ రీజినల్ కో ఆర్డినేటర్ అంజలి కుమారి తెలిపారు. మార్చి 31 వరకు ఆన్‌లైన్, మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. www.mjptbcwreis.telangana.gov.in వెబ్సైట్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
Similar News
News March 1, 2026
యాదాద్రిలో నేటి నుంచి నిత్య ఆర్జిత సేవలు పునఃప్రారంభంలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియడంతో, నేటి నుంచి నిత్య ఆర్జిత సేవలు పునఃప్రారంభం కానున్నాయి. 11రోజుల వేడుకల అనంతరం నిత్య సుదర్శన నరసింహ హోమం, నిత్య కల్యాణం, జోడు సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఈవో భవానీ శంకర్ తెలిపారు. ఉత్సవాల కారణంగా నిలిపివేసిన ఈ సేవలను భక్తులు వినియోగించుకోవాలని కోరారు. బ్రహ్మోత్సవాల ముగింపుతో స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.
News March 1, 2026
అన్నమయ్య: ప్రేమ పెళ్లి.. PSలో కౌన్సిలింగ్

అన్నమయ్య జిల్లా రామసముద్రం (M) దొడ్డిపల్లికి చెందిన సంతోశ్, భవాని అనే ప్రేమ జంట వివాహం చేసుకుని పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు ఇరువురి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పెద్దలు, గ్రామస్థుల సమక్షంలో చర్చించి వివాహం చేసుకున్నట్లు నిర్ధారించుకున్నారు. అనంతరం జంటను అబ్బాయి తరఫు బంధువులకు అప్పగించారు.
News March 1, 2026
సత్యసాయి: ఆమెది హత్యా? ఆత్మహత్యా?

పుట్టపర్తిలోని పెడపల్లిలో వివాహిత చంద్రకళ (22) శనివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈమె మృతి అనుమానస్పదంగా మారింది. అదనపు కట్నం కోసం భర్తే హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈ మేరకు పుట్టపర్తి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెకు వర్షిత, మోక్షిత ఇరువురు పిల్లలు ఉన్నారు.


