News August 12, 2024

KNR: బెల్టు షాపులతో రూ.30 అదనపు భారం!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో బెల్టు దుకాణాల్లో మద్యం ఏరులై పారుతోంది. లైసెన్స్‌డ్ దుకాణాల నిర్వాహకులు విక్రయాలను పెంచుకునేందుకే బెల్టు దుకాణాలను పోత్సహిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. 60శాతం మద్యం వీటి ద్వారానే అమ్ముడుపోతోందని పలువురు చెబుతున్నారు. ఒక్కో సీసాపై వ్యాపారులు రూ.10, వీటికి బెల్టు షాపుల్లో అదనంగా రూ.20 వసూలు చేస్తుండటంతో మద్యం ప్రియులపై రూ.30 వరకు అదనపు భారం పడుతోంది.

Similar News

News November 27, 2024

కరీంనగర్ రీజియన్‌లో 104 ఆర్టీసీ డ్రైవర్ పోస్టులు

image

మాజీ సైనికులను RTC డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఈ మేరకు కరీంనగర్ రీజియన్‌లో 104 పోస్టులు కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి.అర్హులైనవారు ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26 వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.

News November 27, 2024

ఇబ్రహీంపట్నం: పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. ఎస్సై అనిల్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పుప్పాల రమ్య (19)కు కొంత కాలంగా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆమెకు పెళ్లి ఇష్టం లేక ఇంటి ఆవరణలో గల షెడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రమ్య తండ్రి చిన్నయ్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

News November 27, 2024

ఇబ్రహీంపట్నం: ఉరివేసుకుని యువతి ఆత్మహత్య

image

ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బ గ్రామానికి చెందిన పుప్పాల రమ్య (19) అనే యువతి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై అనిల్ మంగళవారం తెలిపారు. గత 2 నెలలుగా ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తుoడగా ఇష్టం లేదని చెప్పిందనీ, పెండ్లి సంబంధాల విషయంలో తల్లిదండ్రుల నిర్ణయాన్ని నిరాకరించలేక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.