News February 28, 2026
KNR: బొట్టు పెట్టి.. మత్తు చల్లి.. నిలువు దోపిడీ!

కరీంనగర్ జిల్లాలో మాయగాళ్లు మత్తుమందుతో ముంచేస్తున్నారు. భక్తుల వేషంలో ఇళ్ల వద్దకు వచ్చి, కష్టాలు తీరుస్తామంటూ మాయమాటలు చెబుతున్నారు. నుదిటిపై బొట్టు పెడుతున్నట్లు నటించి.. ముక్కు వద్ద మత్తుమందు చల్లి క్షణాల్లో స్పృహ కోల్పోయేలా చేస్తున్నారు. తాజాగా రేకుర్తి, హౌసింగ్ బోర్డు కాలనీలతో పాటు, హుజూరాబాద్ పరిసరాల్లోనూ ఇలాంటి మోసాలు వెలుగుచూశాయి. అపరిచితులను నమ్మవద్దని, జాగ్రత్తగా ఉండాలన్నారు.
Similar News
News March 2, 2026
మేం యుద్ధాన్ని స్టార్ట్ చేయలేదు కానీ ముగిస్తాం: US

ఇరాన్‌తో యుద్ధాన్ని తాము మొదలు పెట్టలేదని, కానీ ముగించేది మాత్రం తామేనని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సేత్ అన్నారు. ఇరాన్‌పై జరిగిన ఏరియల్ ఆపరేషన్ చరిత్రలో అత్యంత సంక్లిష్టమైన, కచ్చితమైనదని పేర్కొన్నారు. ‘ఇరాన్ వంటి ప్రభుత్వాలు అణ్వాయుధాలు కలిగి ఉండకూడదు. అమెరికన్లను చంపే/బెదిరించే ఎవరినైనా వేటాడుతాం. ఇది అంతులేని యుద్ధంగా మారదు. కానీ ఇరాన్‌లో ప్రభుత్వం మారుతుంది’ అని వ్యాఖ్యానించారు.
News March 2, 2026
సంగారెడ్డి: వయోవృద్ధుల సంక్షేమానికి ప్రాధాన్యం: కలెక్టర్

వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సంగారెడ్డిలోని డీకేర్ సెంటర్‌ను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వయోవృద్ధుల కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాన్ని సందర్శించే వృద్ధులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి పాల్గొన్నారు.
News March 2, 2026
పాకిస్థాన్‌పై విరాట్ అద్భుతం చేశారు: రోహిత్

2022 T20WCలో పాకిస్థాన్‌పై విరాట్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారని రోహిత్ శర్మ గుర్తు చేసుకున్నారు. ‘160 పరుగుల టార్గెట్ ఛేదనలో 31కే 4 వికెట్లు పడిపోయాయి. నేను డ్రెస్సింగ్ రూమ్‌లో నిరాశగా ఉండిపోయా. అప్పుడు కోహ్లీ అద్భుతం చేశారు. అసలు మేం గెలిచే స్థితిలోనే లేము. అలాంటి ఇంపార్టెంట్ సిచ్యుయేషన్‌లో కోహ్లీ దాన్ని సుసాధ్యం చేశారు. నేను ఆడిన క్రికెట్ మ్యాచుల్లో అదొక గొప్ప ఆట’ అని ICC ఇంటర్వ్యూలో చెప్పారు.


