News October 20, 2025

KNR: బ్యాంకులో వింత పొకడలు.. దేనికి సంకేతం..?

image

డైరెక్టర్ల తొలగింపు, కేసులు, పార్టీల జోక్యంతో KNR కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అప్రతిష్టను మూటగట్టుకుంది. నిన్నటివరకు ఛైర్మన్‌గా ఉన్న విలాస్ రెడ్డి నామినేటెడ్ పోస్టులో ఛైర్మన్ అయ్యాడు. దీనికితోడు బ్యాంక్ ఎన్నికల్లో ప్యానెల్ ఏర్పాటుకు CONG, BJP, BRSల ప్లాన్లు వింత పోకడలను సూచిస్తోంది. బ్యాంకులో 9,287 మందికి సభ్యత్వం ఉంది. రేపట్నుంచి 23 వరకు నామినేషన్లు, NOV 1న పోలింగ్, 4లోపు పాలకమండలి కొలువుదీరనుంది.

Similar News

News October 20, 2025

మెరిసే చర్మం కోసం ఈ ఫేస్ ప్యాక్‌లు

image

అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. దీనికోసం ఇంట్లోనే ఉండే కొన్నిపదార్థాలతో ఈ ప్యాక్స్ ట్రై చేసి చూడండి. * పెరుగు, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాలు ఉంచి మెల్లగా మసాజ్ చేస్తూ కడిగేయాలి. దీంతో ముఖానికి మంచి గ్లో వస్తుంది. * పసుపు, గంధం, పాలు, రోజ్ వాటర్ కలిపి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ ప్యాక్ వారానికి రెండుసార్లు వేస్తే ముఖం అందంగా మెరిసిపోతుంది.

News October 20, 2025

కరుడుగట్టిన నేరస్థుడు రియాజ్.. కథ ముగిసింది

image

TG: నిజామాబాద్‌ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన రియాజ్ బుల్లెట్ బైకులను చోరీ చేయడంలో దిట్ట అని పోలీసులు వెల్లడించారు. ఇతడిపై 60కి పైగా కేసులున్నాయి. శుక్రవారం కానిస్టేబుల్ ప్రమోద్ ఇతడిని పట్టుకుని బైకుపై తీసుకెళ్తుండగా కత్తితో పొడిచి చంపి పారిపోయాడు. నిన్న పోలీసులు అతడిని పట్టుకున్నారు. ఆ క్రమంలో గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్చారు. ఇవాళ గన్ తీసుకుని పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయాడు.

News October 20, 2025

HYD: సెంచరీకి మరో ఆరు.. రేపు పూర్తయ్యే అవకాశం

image

మీరు చదివింది నిజం.. సెంచరీకి మరో ఆరుమంది దూరంగా ఉన్నారు. అయితే అది క్రికెట్‌లో కాదండి.. ఎన్నికల్లో. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీచేసేందుకు ఆసక్తి ఉన్న వారు నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు 94 మంది నామినేషన్లు సమర్పించారు. ఇక కేవలం 6 వేస్తే వీరి సంఖ్య 100కు చేరుకుంటుందన్నమాట. నామినేషన్ల దాఖలుకు రేపు చివరి రోజు కావడంతో ఈ సంఖ్య ఎంతకు చేరుతుందో అని ప్రజలతోపాటు అధికారులు ఎదురుచూస్తున్నారు.