News September 7, 2025

KNR: మంత్రులూ.. జర రైతులను పట్టించుకోండి..!

image

ఉమ్మడి KNR జిల్లాలో ఓ పక్క భారీ వర్షాలతో పంట నష్టం, మరోపక్క యూరియా కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అన్నదాతకు అండగా ఉంటూ భరోసా కల్పించాల్సిన మంత్రులు ఎక్కడున్నారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంట పరిహారం ఎప్పుడు ఇస్తారు? యూరియా కష్టాలు ఎప్పుడు తీరుస్తారు? అంటూ మండిపడుతున్నారు. ఇప్పటికైనా పట్టించుకోండంటూ వేడుకుంటున్నారు.

Similar News

News September 7, 2025

ఆర్చరీలో భారత్ సరికొత్త చరిత్ర

image

సౌత్ కొరియాలో జరుగుతున్న ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత ఆర్చర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. కాంపౌండ్ మెన్స్ టీమ్ విభాగంలో తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌లుగా నిలిచారు. ఫైనల్లో ఫ్రెంచ్ పెయిర్‌పై రిషభ్, ప్రతమేశ్, అమన్‌తో కూడిన భారత జట్టు 235-233 తేడాతో విజయం సాధించింది. దీంతో దేశం తరఫున మొట్టమొదటి బంగారు పతకం కైవసం చేసుకుంది. మరోవైపు కాంపౌండ్ మిక్స్‌డ్‌ ఫైనల్లో జ్యోతిసురేఖ జోడీ ఓడి రజతంతో సరిపెట్టుకుంది.

News September 7, 2025

GWL: BRS లో ఉన్న.. MLA బండ్ల కీలక వ్యాఖ్యలు

image

నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పార్టీల కంటే గద్వాల అభివృద్ధి ముఖ్యమని చెప్పారు. ఇదివరకే స్పీకర్ నోటీసులకు సమాధానం ఇచ్చానని తెలిపారు. కేసీఆర్‌ను గౌరవించే వారిలో నేను ముందుంటానన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. ఏ పార్టీ కండువా కూడా కప్పుకోలేదని స్పష్టం చేశారు.

News September 7, 2025

నేను ఏ పార్టీ కండువా కప్పుకోలేదు: బండ్ల

image

TG: తాను BRSలోనే ఉన్నానని, వేరే ఏ పార్టీ కండువా కప్పుకోలేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. తానెప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పారు. స్పీకర్‌ నోటీస్‌కు సమాధానం ఇచ్చానని, సీఎంను కలిసిన వివరాలు పొందుపరిచానని పేర్కొన్నారు. కాగా BRS నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టు స్పీకర్‌కు సూచించిన విషయం తెలిసిందే.