News December 22, 2025
KNR: మత్తు చిత్తులో యువత.. ‘EAGLE’ దూకుడెక్కడ..?

గంజాయి, డ్రగ్స్‌కు బానిసై యువత బతుకులు ఛిద్రం చేసుకుంటోంది. గల్లీలకూ ఈ కల్చర్ పాకడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నా గంజాయి అక్రమ రవాణా ఆగట్లేదు. జిల్లాల్లో ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా అండ్ ఎన్ఫోర్స్మెంట్(EAGLE) మరింత ప్రభావవంతంగా పనిచేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2025లో KNR కమిషనరేట్ పరిధిలో 27 కేసులు నమోదు కాగా రూ.9,89,025ల 39.561 KGల గంజాయిని పట్టుకున్నారు.
Similar News
News December 26, 2025
DRDOలో 764పోస్టులు.. దరఖాస్తు చేశారా?

DRDOకు చెందిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్‌లో 764 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు JAN 1వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18-28 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. పోస్టును బట్టి డిప్లొమా, BSc, BLSc, MLSc, టెన్త్, ITI ఉత్తీర్ణులు అర్హులు. టైర్ 1, టైర్ 2 రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీ వెళ్లండి.
News December 26, 2025
WGL: ఆర్టీఏ సేవల్లో సెప’రేటు’?

వరంగల్, హనుమకొండ ఆర్టీఏ కార్యాలయాల్లో వసూళ్ల దందా జోరుగా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్రోకర్ల సిగ్నల్‌తోనే డ్రైవింగ్ టెస్ట్ పాస్ చేస్తున్నారని, సరైన ట్రాక్ లేకున్నా వందల లైసెన్సులు జారీ అవుతున్నాయని విమర్శలు ఉన్నాయి. లెర్నింగ్ లైసెన్స్ పరీక్షలో ఆపరేటర్లే సమాధానాలు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రతి సేవకు రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారని, అక్రమ సంపాదనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
News December 26, 2025
రంప: ప్రమాదాలు జరిగాక పోలీసుల చర్యలు!

రంపచోడవరం నియోజకవర్గ వ్యాప్తంగా గత రెండు నెలలుగా అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ప్రమాదాల నివారణకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మారేడుమిల్లి ఘాట్ రోడ్డు లో బస్సు లోయలో పడితే ఆ తరువాత ఘాట్ రోడ్ పై రాత్రి వేళలు రాకపోకలు నిలిపివేశారు. బుధవారం వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో నలుగురు చనిపోవడంతో ప్రస్తుతం విస్తృతంగా వాహన తనిఖీలు చేస్తున్నారు.


