News October 7, 2025

KNR: మద్యానికి బానిసై యువుకుడి ఆత్మహత్య

image

కరీంనగర్లోని బుట్టి రాజారాం కాలనీకి చెందిన శ్రీనివాస్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మద్యానికి బానిసైన శ్రీనివాస్ రాత్రి ఇంటికి వచ్చి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఎంత పిలిచినా పలకకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా శ్రీనివాస్ ఉరివేసుకొని మృతి చెందినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 7, 2025

జామాకులనూ ఆన్‌లైన్‌‌లో అమ్మేస్తున్నారు!

image

ఎండిన, పచ్చి జామాకులకు ఆన్‌లైన్‌లో డిమాండ్ బాగా పెరిగింది. వీటితో చాలా హెల్త్ బెన్ఫిట్స్ ఉన్నాయని తెలియడంతో చాలా మంది కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో 50 జామ ఆకులను ఏకంగా రూ.300కు, మరో సైట్‌ ఎండిపోయిన 20 ఆకులను రూ.300కు దర్జాగా అమ్మేస్తోంది. అయితే గతేడాది జామాకుల బిజినెస్ రూ.1300 కోట్లు జరిగిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

News October 7, 2025

మహిళలూ ఒంటరిగా క్యాబ్‌లో ప్రయాణిస్తున్నారా?

image

ప్రస్తుతకాలంలో వృత్తి, ఉద్యోగాల కారణంగా మహిళలు క్యాబ్స్‌లో ప్రయాణించడం ఎక్కువైంది. అయితే ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. డ్రైవర్ ఐడీ, నంబర్ ప్లేట్ చెక్ చేయాలి. ట్రిప్ వివరాలు సన్నిహితులకు పంపడం మంచిది. గుర్తింపు ఉన్న క్యాబ్ సర్వీసులనే ఎంచుకోవాలి. పరిసరాలు, రూట్ గమనిస్తూ అలర్ట్‌గా ఉండాలి. బ్యాక్ సీట్‌లో కూర్చుంటే విజిబులిటీ బావుంటుంది. తెలియనివారికోసం డోర్లు తెరవకూడదు.

News October 7, 2025

బొత్స ఫ్యామిలీకి తప్పిన ప్రమాదం

image

AP: విజయనగరంలో జరుగుతున్న సిరిమానోత్సవంలో స్వల్ప అపశ్రుతి చోటు చేసుకుంది. వేడుక చూస్తుండగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ కూర్చున్న వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎస్సై, ఓ చిన్నారి స్వల్పంగా గాయపడ్డారు. బొత్స ఫ్యామిలీ సురక్షితంగా బయటపడింది.