News November 16, 2025
KNR: మహిళా డిగ్రీ కళాశాలలో పీజీ స్పాట్ అడ్మిషన్లు

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2025 -26 విద్యాసంవత్సరం పీజీ కోర్సుల్లో ఖాళీల కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రో.డి.వరలక్ష్మి తెలిపారు. ఎంఏ ఇంగ్లీష్, తెలుగు, ఎంకాం, ఎమ్మెస్సీ బోటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ కోర్సుల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. దరఖాస్తులను కళాశాల కార్యాలయంలో ఈ నెల 17వ తేదీ సా. 5గం.లలోపు అందజేయాలని సూచించారు. 18వ తేదీన సీటు కేటాయించనున్నట్లు తెలిపారు.
Similar News
News November 16, 2025
పల్నాడు యుద్ధ వీరుల ఆయుధాల గురించి మీకు తెలుసా.?

11వ శతాబ్దంలో పల్నాడు యుద్ధంలో వీరులు ఉపయోగించిన ఆయుధాలు నేటికీ సజీవంగా పూజలు అందుకుంటున్నాయి. మహామంత్రి బ్రహ్మనాయుడు ఉపయోగించిన నృసింహకృతం, బాలచంద్రుడు వాడిన సూర్య బేతాళం, సర్వ సైన్యాధ్యక్షుడు మాల కన్నమదాసు భైరవ ఖడ్గం నేటికీ కారంపూడి వీరుల దేవాలయం, మాచర్ల చెన్నకేశవస్వామి ఆలయంలో పూజింపబడుతున్నాయి. ఉత్సవాలకు వీటిని బయటకు తెచ్చి యుద్ధ రీతులలో ప్రదర్శించి ముగింపు అనంతరం తిరిగి భద్రపరుస్తారు.
News November 16, 2025
SBIలో 103 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు.. అప్లై చేశారా?

SBIలో 103 కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, PG, CA, CFA,CFP,MBA, పీజీ డిప్లొమా, PGDM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వయసు 25-50ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.750, SC, ST, PWBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://sbi.bank.in/
News November 16, 2025
తమిళనాడు నుంచి ఏపీకి $150 మిలియన్ల పెట్టుబడులు

సౌత్ కొరియాకు చెందిన Hwaseung కంపెనీ ఏపీలో $150 మిలియన్ల పెట్టుబడులు పెట్టనుంది. కుప్పంలో నాన్-లెదర్ స్పోర్ట్స్ షూలను ఉత్పత్తి చేయనుంది. గ్లోబల్ బ్రాండ్లైన Nike, Adidasలను ఈ సంస్థే తయారు చేస్తుంది. కుప్పంలో ఏడాదికి 20 మిలియన్ల షూ జతలను ఉత్పత్తి చేయనున్నారు. 20వేల మందికి ఉపాధి దక్కే అవకాశం ఉంది. ఈ ఆగస్టులో తమిళనాడుతో ఒప్పందం చేసుకున్నా తాజాగా ఏపీకి వస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.


