News April 25, 2024
KNR: మానసిక సమస్యల కోసం టోల్ ఫ్రీ నెంబర్
విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎవరైనా మానసిక ఆందోళనలు లేదా మానసిక ఒత్తిడికి గురి అయినప్పుడు మానసిక వైద్యుడిని సంప్రదించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత సూచించారు. చిరాకు పడడం, ఆసక్తిని కోల్పోవడం, నిద్రలేమి వంటి సమస్యలతో మానసిక ఒత్తిడికి గురి అయినట్లు భావిస్తే టెలి మానస్ టోల్ ఫ్రీ నెంబర్ 14416 ఫోన్ చేసి మానసిక వైద్యుడు సలహాలను సూచనలను ఉచితంగా పొందవచ్చునని తెలిపారు.
Similar News
News January 7, 2025
జగిత్యాల: వెటర్నరీ సైన్స్ బెస్ట్ ప్రొఫెషన్: కలెక్టర్
వెటర్నరీ సైన్స్ బెస్ట్ ప్రొఫెషన్ అని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల వెటర్నరీ కళాశాల వార్షికోత్సవ వేడుకలలో సోమవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వెటర్నరీ రంగం రైతుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తుందని, పశుసంవర్ధక ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి మెరుగవుతుందన్నారు. విద్యార్థులు ఈ రంగంలో కొత్త ఆవిష్కరణలు చేసేందుకు ముందుకు రావాలన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రశంసించారు.
News January 6, 2025
ఆధునిక టెక్నాలజీలో గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్: శ్రీధర్ బాబు
ఆధునిక టెక్నాలజీలో గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్ విస్తరిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ మేరకు ‘డేటా ఎకానమీ’ నూతన వర్క్ స్టేషన్‌ను ఆయన హైటెక్ సిటీలో ప్రారంభించి మాట్లాడారు. స్టార్ట్ అప్ కంపెనీలు, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రాలు, డేటా సెంటర్ల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతున్నాయని అన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు సాఫ్ట్ వేర్ సంస్థలు విస్తరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
News January 6, 2025
కరీంనగర్: మానసాదేవి టెంపుల్.. చాలా స్పెషల్!
KNR జిల్లా గన్నేరువరం మండలం కాశింపేటలోని 800ఏళ్లనాటి మానసాదేవి మహాక్షేత్రం ప్రత్యేకమైనది. దేశంలో వెలసిన 2 స్వయంభు ఆలయాల్లో మొదటిది హరిద్వార్‌లో ఉండగా.. రెండోది మన జిల్లాలోనే ఉండటం విశేషం. అమ్మవారు కోరిన కోర్కెలను తక్షణమే తీరుస్తారని భక్తుల నమ్మకం. ఇక్కడ అమ్మవారితో పాటు దాదాపు 108 నాగదేవతల విగ్రహాలు ఉన్నాయట. గత ఆరేళ్లలో సంతానం లేని మహిళలు అమ్మవారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు.