News January 2, 2026
KNR: మానేరు రివర్ ఫ్రంట్ అక్రమాలపై అసెంబ్లీలో చర్చ?

మానేరు రివర్ ఫ్రంట్ పనుల్లో జరిగిన అక్రమాలపై అసెంబ్లీలో చర్చించేందుకు అధికార పార్టీ సిద్ధమవుతోంది. గత ప్రభుత్వం పర్యాటక అభివృద్ధి కోసం కేటాయించిన రూ.545 కోట్లలో, పనులు పూర్తి కాకుండానే రూ.192 కోట్లు బిల్లుల రూపంలో చెల్లించడం వివాదాస్పదమైంది. దీనిపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు నిరసనలు చేపట్టాయి. కాగా సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.
Similar News
News January 2, 2026
శింగనమలకు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్, ప్రియాంక?

ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ ఫిబ్రవరి 2న శింగనమల నియోజకవర్గంలోని బండపల్లికి కాంగ్రెస్ అగ్రనేతలు రానున్నట్లు సమాచారం. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ పథకాన్ని బండ్లపల్లిలోనే ప్రారంభించారు. తర్వాత దేశవ్యాప్తంగా అమలైంది.
News January 2, 2026
NZB: అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ నుంచి పోటీ చేస్తాం: కవిత

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ నుంచి పోటీ చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు స్వీయ రాజకీయ శక్తి అవసరం ఉందన్నారు. మొదటి నుంచి నేను స్వతంత్రంగా పని చేశానని, BRSపై మనసు విరిగిందన్నారు. KCR పిలిచినా మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లేది లేదన్నారు.
News January 2, 2026
రూ.7వేల కోట్లతో హైదరాబాద్‌కు గోదావరి జలాలు: సీఎం రేవంత్

TG: ఏడాదంతా మూసీనదిలో నీళ్లు ప్రవహించడానికి ప్రణాళికలు రచిస్తున్నామని సీఎం రేవంత్ అసెంబ్లీలో తెలిపారు. మూసీ ప్రక్షాళన కన్సల్టెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచామని చెప్పారు. రూ.7వేల కోట్ల ఖర్చుతో గోదావరి నదీ జలాలను (15 టీఎంసీలు) హైదరాబాద్‌కు తరలిస్తామన్నారు. వివిధ రాష్ట్రాల్లో నదీపరివాహక ప్రాంతాల అభివృద్ధిని ఎన్నికల అజెండాగా పెట్టుకున్న బీజేపీ.. ఇక్కడెందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు.


