News January 11, 2026

KNR: మార్కెట్‌లో సంక్రాంతి ముగ్గుల రంగులకు గిరాకీ!

image

సంక్రాంతి పండుగ వేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రంగుల విక్రయాలు జోరందుకున్నాయి. కొత్త డిజైన్ల కోసం మహిళలు ఆసక్తి చూపుతుండటంతో మార్కెట్లలో రంగులకు డిమాండ్ పెరిగింది. లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి, చెడును తొలగించడానికి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయడం ఆనవాయితీ. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో గొబ్బెమ్మలతో అలంకరించిన ముగ్గులు సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తాయి.

Similar News

News February 20, 2026

విజయవాడలో మిస్సైన పిల్లలు గుజరాత్‌లో..!

image

విజయవాడ భవానీపురంలో <<19188253>>మిస్సైన ఇద్దరు పిల్లల కేసు<<>> సుఖాంతమైంది. ట్యూషన్‌కు వెళ్లకుండా ఇంట్లోని నగదు తీసుకుని పారిపోయిన మేరారామ్ (12), ఉమారామ్ (13) ఆచూకీ లభ్యమైంది. గురువారం విజయవాడ నుంచి ముంబైకి వెళ్లిన చిన్నారులు, అక్కడి నుంచి గుజరాత్‌కు వెళ్తుండగా పోలీసులు చాకచక్యంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు క్షేమంగా దొరకడంతో అటు తల్లిదండ్రులు, ఇటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

News February 20, 2026

ట్రంప్ టారిఫ్స్ దందా రివర్స్.. మన పరిస్థితి ఏంటి?

image

US అధ్యక్షుడు ట్రంప్ ఇన్నాళ్లూ ఆడిన టారిఫ్ గేమ్‌కు ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పుతో చెక్ పడినట్లు అయింది. అయితే టారిఫ్స్‌కు బెదిరి డీల్స్ కుదుర్చుకున్న దేశాల పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశమైంది. భారత్ కూడా ఇటీవల డీల్ కుదుర్చుకుంది. మరి సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం ఆ ట్రేడ్ డీల్‌పై పడుతుందా అనేది బిగ్ క్వశ్చన్. మారిన పరిణామాల నేపథ్యంలో భారత్ ఈ డీల్‌పై వెనక్కి తగ్గే అవకాశం ఉందా? అనేది తెలియాల్సి ఉంది.

News February 20, 2026

సింగరేణిలో నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

సింగరేణి సంస్థలో ఇంటర్నల్ అభ్యర్థులతో నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టుల భర్తీకి యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. 17 జూనియర్ కెమిస్ట్/ జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ (టీ అండ్ ఎస్ గ్రేడ్-3) పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 20న మధ్యాహ్నం 12 నుంచి మార్చి 4న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.