News December 16, 2025

KNR: మార్చిలోగా అమృత్‌-2 పనులు పూర్తి చేయాలి: సీడీఎంఏ

image

కరీంనగర్ జిల్లాలో అమృత్-2 పథకం కింద చేపట్టిన మంచినీటి సరఫరా పనులను మార్చిలోగా వేగవంతంగా పూర్తి చేయాలని సీడీఎంఏ శ్రీదేవి కమిషనర్లను ఆదేశించారు. పైప్‌లైన్‌, రిజర్వాయర్ల నిర్మాణాల పురోగతిపై ఆమె వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. పనులు ఆలస్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, వారానికి ఒకసారి పురోగతిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆమె స్పష్టం చేశారు.

Similar News

News December 16, 2025

కరీంనగర్: నిరుద్యోగులకు అవకాశం.. 19న జాబ్ మేళా

image

కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగుల కోసం ఈ నెల 19న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి అధికారి తిరుపతి రావు తెలిపారు. ఆటోమోటివ్స్ KNR సంస్థలోని 20 పోస్టులకు గాను, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన 20-40 ఏళ్ల పురుషులు అర్హులు. వేతనం రూ.14,000 నుంచి ప్రారంభమవుతుందని, ఆసక్తి గలవారు పేరు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. వివరాలకు 72076 59969 నంబర్లను సంప్రదించవచ్చు.

News December 16, 2025

కరీంనగర్: ఎన్నికల బందోబస్తుకు 877 మంది పోలీసు సిబ్బంది

image

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల బందోబస్తు కోసం దాదాపు 877 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. ఇందులో ఆరుగురు ఏసీపీలు, 20 ఇన్స్పెక్టర్లు, 39 ఎస్సైలు, 40 ఏఎస్సైలు/హెడ్ కానిస్టేబుల్స్, 460 కానిస్టేబుళ్లు, 35 స్పెషల్ యాక్షన్ టీమ్ పోలీసులు, 178 హోంగార్డులు, 100 మంది బెటాలియన్ స్పెషల్ పోలీసులు, అదనంగా ఎన్‌సీసీ సభ్యులు కూడా ఉన్నారని పేర్కొన్నారు.

News December 16, 2025

​విజయోత్సవ ర్యాలీలపై నిషేధం: సీపీ గౌస్ ఆలం

image

సర్పంచ్ ఎన్నికల ఫలితాల అనంతరం అదే రోజు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధం అని సీపీ గౌస్ ఆలం స్పష్టం చేశారు. రేపు జరగనున్న మూడో దశ సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలీసు అధికారులకు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ర్యాలీలు తీసిన సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు షేర్ చేసినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.