News September 5, 2024
KNR: మీ ఫేవరెట్ టీచర్ ఎవరు..? కామెంట్ చేయండి!

విద్యార్థుల్లో విజ్ఞాన వెలుగులు నింపుతూ, వారు ఉన్నత స్థాయికి చేరేలా నిరంతరం కృషి చేసే వారే గురువులు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోని అన్ని విద్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సీనియర్ విద్యార్థులు టీచర్లుగా మారి జూనియర్లకు పాఠాలు బోధిస్తూ సందడి చేస్తున్నారు. మరి.. మీ ఫేవరేట్ టీచర్ ఎవరో కామెంట్ చేయండి. SHARE IT
Similar News
News July 9, 2025
చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్‌కు బంగారు పతకం

కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో నిర్వహించిన రాజన్న జోన్ III స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీల్లో చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్ ప్రతిభ కనబరిచారు. మెడికల్ లీగల్ టెస్ట్‌లో బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా సీఐ ప్రదీప్ కుమార్‌ను సీపీ గౌస్ ఆలం, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, అడిషనల్ డీసీపీ ఏఆర్ భీమ్ రావు, ఏసీపీలు విజయ్ కుమార్, వేణుగోపాల్ అభినందించారు.
News July 8, 2025
ముగిసిన పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు

కరీంనగర్‌లో రాజన్న జోన్ III స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు ముగిసినట్లు CP గౌస్ ఆలం మంగళవారం తెలిపారు.సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, యాంటీ సబాటేజ్ చెక్, కంప్యూటర్ అవేర్నెస్ కాంపిటీషన్, డాగ్ స్క్వాడ్ కాంపిటీషన్, పోలీస్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వంటి ఆరు విభాగాలలో పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన వారిని ఎంపిక చేసి వరంగల్‌లో నిర్వహించనున్న పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
News July 8, 2025
పోలీసుల ప్రతిభను గుర్తించడానికే ఈ పోటీలు: KNR సీపీ

KNR పోలీస్ కమీషనరేట్ కేంద్రంగా రాజన్న జోన్ III స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పోలీసు వృత్తిలో మరింత నైపుణ్యం, సామర్థ్యం, ప్రతిభ పెంపొందించుకునేందుకు ఈ ‘పోలీసు డ్యూటీ మీట్’ను నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ పేర్కొన్నారు. నేర దర్యాప్తులో మరింత శాస్త్రీయత, నైపుణ్యం కనబరిచే విధంగా ఈ పోటీలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.