News December 15, 2025

KNR: ముగియనున్న మూడో విడత ఎన్నికల ప్రచారం

image

ఉమ్మడిలో గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల ప్రచారానికి ఈ రోజు సా.5 గంటల నుంచి తెరపడనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్ కు 44 గంటల ముందు నుంచి ఆయా మండలాలు, గ్రామాల్లో సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందని తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఏ విధమైన ప్రచారాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల ఉల్లంఘనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News December 17, 2025

ధనుర్మాసం: రెండవరోజు కీర్తన

image

‘భాగ్యవంతులైన గోకుల గోపికలారా! ఈ ధనుర్మాస వ్రతంలో మన కర్తవ్యం నారాయణుని పాదాలను కీర్తించడం. వ్రత కాలంలో ఇతర విషయాలు తలవకుండా, పాలు, నేతిని తాగడం, కంటికి కాటుక, సిగలో పూలు ధరించడం వంటివి మానేయాలి. శాస్త్ర విరుద్ధ పనులు చేయరాదు. చాడీలు చెప్పవద్దు. సన్యాసులు, బ్రహ్మచారులకు దానాలు చేయాలి. మనకు మోక్షాన్ని ఇచ్చే ఇతర మార్గాలన్నీ సంతోషంగా ఆచరించాలి. ధనుర్మాసమంతా ఈ నియమాలనే పాటించాలి’. <<-se>>#DHANURMASAM<<>>

News December 17, 2025

మెదక్: నాడు భర్త ఉప సర్పంచ్.. నేడు భార్య సర్పంచ్

image

గత ఎన్నికలలో గెలిచి భర్త పాలకవర్గంలో ఉప సర్పంచ్‌గా సేవలు అందించగా నేడు భార్య సర్పంచ్‌గా గెలిచి సేవలు అందించనున్నారు. మనోహరాబాద్ మండలంలోని చెట్ల గౌరారంలో సర్పంచ్‌గా చింతకింది దివ్య గెలుపొందారు. ఒకే కుటుంబంలో భర్త, భార్య గెలిచి నిలిచారు.

News December 17, 2025

IPL మినీ వేలం.. అన్‌సోల్డ్ ప్లేయర్లు!

image

మెక్ గుర్క్, కాన్వే, అన్మోల్ ప్రీత్, అభినవ్ మనోహర్, యష్ ధుల్, కోయెట్జి, స్పెన్సర్ జాన్సన్, తీక్షణ, సిమర్జిత్ సింగ్, కర్ణ్ శర్మ, సకారియా, మురుగన్ అశ్విన్, KC కరియప్ప, తస్కిన్ అహ్మద్, అల్జారీ జోసెఫ్, రిచర్డ్‌సన్, అట్కిన్సన్, ముల్డర్, దీపక్ హుడా, విజయ్ శంకర్, లోమ్రోర్, తనుష్ కోటియన్, కమలేశ్ నాగర్‌కోటి, అబాట్, బ్రేస్ వెల్, శనక, డారిల్ మిచెల్, KS భరత్, గుర్బాజ్, బెయిర్ స్టో, జామీ స్మిత్ తదితరులు.