News November 21, 2025

KNR: ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయుల సస్పెండ్

image

KNR జిల్లాలో ముగ్గురు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను DEO సస్పెండ్ చేశారు. హుజురాబాద్ పాఠశాల టీచర్లు ప్రవీణ్ కుమార్, సమ్మయ్య మద్యం సేవించి విధులకు హాజరైనట్లు ఆరోపణలు రాగా, చెల్పూర్ టీచర్ ఐలయ్య విధుల్లో నిర్లక్ష్యం, పైఅధికారుల ఆదేశాలు పాటించకపోవడం కారణాలతో వేటుకు గురయ్యారు. పలుమార్లు హెచ్చరికలు ఇచ్చినప్పటికీ వారిలో మార్పు రాకపోవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Similar News

News November 22, 2025

వెయిట్ లిఫ్టర్లను అభినందించిన కలెక్టర్

image

ఈ నెల 14 నుంచి 16 వరకు విజయనగరం జిల్లాలో నిర్వహించిన 12వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, సీనియర్ ఉమెన్, మెన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కర్నూలు లిఫ్టర్లు పతకాలు సాధించారు. వెయిట్ లిఫ్టర్లు వీరేశ్, ముషరాఫ్, పర్వేజ్, చాంద్ బాషా, హజరత్ వలిని కలెక్టర్ డా.సిరి శనివారం అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయి వెయిట్ పోటీల్లోనూ ఇదే ప్రతిభ కనబరచాలన్నారు. కోచ్ యూసుఫ్ పాల్గొన్నారు.

News November 22, 2025

బీసీలను ప్రభుత్వం నట్టేట ముంచింది: R.కృష్ణయ్య

image

TG: BCలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించి చివరికి ప్రభుత్వం నట్టేట ముంచిందని ఎంపీ R.కృష్ణయ్య మండిపడ్డారు. రిజర్వేషన్లపై సర్కార్ ఇవాళ జారీ చేసిన జీవో 46ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సూచించినట్లుగా ప్రస్తుత సామాజిక-రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేయకుండా, గదుల్లో కూర్చొని నివేదికలు సిద్ధం చేయడం బీసీలను రాజకీయంగా దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించారు.

News November 22, 2025

UPDATE: MBNR: పీయూ.. పలు కోర్సుల ఫలితాలు

image

పాలమూరు వర్సిటీలోని పరిపాలన భవనములో బి.ఎడ్,ఎం ఫార్మసీ,బిపిఎడ్,ఎం ఫార్మసీ, LLB ఫలితాలను వర్సిటీ వీసీ ప్రొఫెసర్ GN శ్రీనివాస్ విడుదల చేశారు.
✒బి.ఎడ్ 2వ సెమిస్టర్-71.98%
✒బి.ఎడ్ 4వ సెమిస్టర్- 93.48%
✒LLB 2వ సెమిస్టర్-68.85%
✒LLB 4వ సెమిస్టర్- 86.81%
✒బి.ఫార్మసీ 4వ సెమిస్టర్-60.40%
✒బీఫార్మసీ 6వ సెమిస్టర్-57.77%
✒ఎం.ఫార్మసీ 2వ సెమిస్టర్-72.22%
✒బిపిఎడ్ 2వ సెమిస్టర్-87.13%