News June 11, 2024
KNR: మూడు రోజుల్లో ముగ్గురి మృతి

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి వరుస మరణాలు జరుగుతున్నాయి. గత 3 రోజుల్లో ముగ్గురు మృతి చెందారు. శుక్రవారం ఎల్లంపల్లిలో శంకరయ్య(75), శనివారం గుజ్జులపల్లిలో కందుగుల గ్రామానికి చెందిన దినసరి కూలీ శనిగరం మొగిలి(45), ఆదివారం ఘన్పూర్ తండాకు చెందిన డిగ్రీ విద్యార్థి బానోతు ఆంజనేయులు(18) ప్రమాదవశాత్తు వ్యవసాయ బావుల్లో పడి మృతి చెందారు.
Similar News
News November 8, 2025
కరీంనగర్ జిల్లా ప్రగతిపై గవర్నర్ సమీక్ష

కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా గవర్నర్ శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా అధికారులు, ప్రముఖులతో ముఖాముఖి నిర్వహించారు. అంతకుముందు శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి పవర్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా సమగ్ర స్వరూపాన్ని, కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు తీరును గవర్నర్కు వివరించారు. పథకాలు సమర్థవంతంగా అమలు అవుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.
News November 8, 2025
KNR: విద్యార్థులకు రాజ్యాంగ హక్కులపై అవగాహన

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవం సందర్భంగా KNR జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును శుక్రవారం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ, సీనియర్ సివిల్ జడ్జి కె. వెంకటేష్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, వారి భద్రత కోసం రూపొందించిన చట్టాల గురించి సవివరంగా వివరించారు.
News November 8, 2025
కరీంనగర్: ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ

KNR-1 డిపో ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటుచేసినట్లు DM విజయ మాధురి తెలిపారు. టూర్ ప్యాకేజీలో అన్నవరం, పిఠాపురం 10వ శక్తిపీఠం, సింహాచలం, వైజాగ్ కైలాస గిరి బీచ్, ద్వారక తిరుమల దర్శించడానికి సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని చెప్పారు. NOV 11న ఉ.5 గం.కు KNR నుంచి బయలుదేరి తిరిగి NOV 13న KNR చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు రూ.3,500, పిల్లలకు రూ.2,625 అన్నారు. వివరాలకు 7382849352 సంప్రదించాలన్నారు.


